లాక్ డౌన్ ప్రకటించిన కర్ణాటక : అదేబాటలో తెలుగు రాష్ట్రాలు వెళ్లక తప్పని పరిస్థితి

lock down in karnataka

ఒక్కో రాష్ట్రం లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర లాక్ డౌన్ విధించగా.. దక్షిణ భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ లో పూర్తి లాక్ డౌన్ విధించింది కర్ణాటక రాష్ట్రం. రెండు వారాలు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది కర్ణాటక.

ఏప్రిల్ 27వ తేదీ ఉదయం నుంచి 14 రోజులు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని అనౌన్స్ చేసింది యడ్యూరప్ప ప్రభుత్వం. ఈ కీలక నిర్ణయం తీసుకోవటానికి కారణం కేసులు పెరగటమే. ఏప్రిల్ 25వ తేదీ ఒక్క రోజే 34 వేల కొత్త కేసులు వచ్చాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతుండటం, ఆస్పత్రిలో బెడ్స్ లేకపోవటం, మందుల కొరత తలెత్తటంతో లాక్ డౌన్ విధించింది కర్ణాటక.

ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కోసం అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఈ నాలుగు గంటల్లోనే అన్ని పనులు చక్కదిద్దుకోవాలని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది. అంతర్ రాష్ట్ర బస్సు, రైలు, విమాన సర్వీసులు నడుస్తున్నాయని.. అయితే సరైన కారణం చూపాలని ప్రయాణికులను కోరింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించి అనుమతిస్తామని స్పష్టం చేసింది.

కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు చేరుకున్నాయి. ఈ కేసులు డబుల్ అయితే.. అంటే రోజువారీగా 20 వేలకు చేరుకుంటే మాత్రం లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారంగా చెబుతున్నారు అధికారులు. ఇప్పటికే అన్ని ఆస్పత్రుల్లో బెడ్స్ ఫుల్ అయ్యాయి. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనూ 2 వారాలు లాక్ డౌన్ విధించే సూచనలు ఉన్నాయి. లాక్ డౌన్ ఉండదని కర్ణాటక ప్రభుత్వం.. ఒకటికి 10 సార్లు ప్రకటించింది.. ఇప్పుడు లాక్ డౌన్ చేసింది.. మన ప్రభుత్వాలు ఇందుకు మినహాయింపు కాదు. సరిహద్దుల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణలో సైతం ఏక్షణంలోనైనా ఈ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు