వెంటిలేటర్ పై కత్తి మహేష్.. ఆరోగ్యం విషమంగా ఉందన్న డాక్టర్లు

వెంటిలేటర్ పై కత్తి మహేష్.. ఆరోగ్యం విషమంగా ఉందన్న డాక్టర్లు

కత్తి మహేష్ ఆరోగ్యంపై అతని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురయిన సమయంలో తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు డాక్టర్లు.

ప్రస్తుతం నెల్లూరులోని మెడికవర్ కార్పొరేట్ ఆస్పత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వివరించారు డాక్టర్లు.

యాక్సిడెంట్ లో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇప్పటికే ముక్కుకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు డాక్టర్లు వివరించారు.

యాక్సిడెంట్ సమయంలో కారు అద్దాలతోపాటు ముందు భాగంగా నుజ్జునుజ్జు అయ్యిందని.. గాజు ముక్కలు ముఖం భాగంలో గుచ్చుకున్నాయని.. కళ్లకు కూడా ఆపరేషన్ చేయాల్సి ఉందని చెబుతున్నారు డాక్టర్లు.

మెదుడుకు సంబంధించి సిటీ స్కాన్ తీయటం జరిగిందని.. ఎక్కడైనా రక్తం గడ్డగట్టి ఉంటే ఆపరేషన్ చేస్తామని చెబుతున్నారు. అన్ని రిపోర్టులు పరిశీలించిన తర్వాతే అతని ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీకి వస్తామని చెప్పారు.

జూన్ 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న సమాచారం అయితే.. కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. శరీరంగా చికిత్సకు సరిగా స్పందించటం లేదని ఆస్పత్రి వర్గాల వెర్షన్. చికిత్స కావాల్సిన అన్ని వసతులు ఆస్పత్రిలో ఉన్నాయని.. అవసరం అయితే చెన్నై తరలించటానికి సైతం సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.

యాక్సిడెంట్ వార్త తెలిసిన వెంటనే.. కత్తి మహేష్ కుటుంబ సభ్యులు, ఆప్తులు ఆస్పత్రికి చేరుకున్నారు. డాక్టర్లలో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన విషయం ఇది..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు