కోమాలో కత్తి మహేష్.. ఓ కన్ను డ్యామేజ్.. బ్రెయిన్ సర్జరీకి అవకాశం

కోమాలో కత్తి మహేష్.. ఓ కన్ను డ్యామేజ్.. బ్రెయిన్ సర్జరీకి అవకాశం

కోమాలో కత్తి మహేష్.. ఓ కన్ను డ్యామేజ్.. బ్రెయిన్ సర్జరీకి అవకాశం

సినీ నటుడు, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ ఆరోగ్యంపై ఆస్పత్రి డాక్టర్లు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి వచ్చారని.. అప్పటి నుంచి ఐసీయూలో ఉంచి.. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వివరించారు.

కత్తి మహేష్ ప్రస్తుతం కోమాలో ఉన్నారని… వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్నామని వివరించారు.

ఎడమ కన్ను బాగా దెబ్బతిన్నదని.. తీవ్రగాయం అయ్యిందని తెలిపారు. మరో కన్నుకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఓ కన్నుకు మాత్రం ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉందన్నారు. కంటి ఆపరేషన్ కోసం చెన్నై తరలించనున్నట్లు తెలిపారు.

బ్రెయిన్ లో డ్యామేజ్ ఉందని.. రక్తం గడ్డకట్టినట్లు తెలిపారు. దీన్ని మందుల ద్వారా తగ్గించటమా లేక ఆపరేషన్ చేయాల్సి వస్తుందా అనేది ఇప్పటికప్పుడు చెప్పలేం అని తెలిపారు. అత్యవసరం అయితే బ్రెయిన్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని మాత్రమే తెలిపారు.

మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో లేదా మరో ఆస్పత్రికి తరలించటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.

మూడు రోజులు గడిస్తే కానీ పూర్తి సమాచారం ఇవ్వలేం అని.. ఏ విషయం చెప్పలేం అంటున్నారు డాక్టర్లు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు