కత్తి మహేష్ కన్నుమూత.. చెన్నై ఆస్పత్రిలో తుది శ్వాస

కత్తి మహేష్ కన్నుమూత.. చెన్నై ఆస్పత్రిలో తుది శ్వాస

సినీ నటుడు, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ కన్నుమూశాడు. జూలై 10వ తేదీ మధ్యాహ్నం 4 గంటల సమయంలో కన్నుమూసినట్లు ప్రకటించారు వైద్యులు.

రెండు వారాల క్రితం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కంటెనర్ ను బలంగా ఢీకొనటంతో తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరులో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.

కత్తి మహేష్ వైద్యం కోసం ఏపీ ప్రభుత్వం 17 లక్షల రూపాయలు విడుదల చేసింది. ఆయనకు బ్రెయిన్ సర్జరీ కూడా చేశారు. అయినా ఫలితం లేకపోయింది.

కత్తి మహేష్ ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు మొదటి నుంచీ చెబుతున్నారు. ప్రమాద సమయంలోనే తలకు తీవ్రగాయమైంది. నెల్లూరు ఆస్పత్రిలోనే ముక్కుకు సర్జరీ చేశారు. చెన్నై తరలించిన తర్వాత ఇన్ఫెక్షన్ కావటంతో ఓ కన్ను తొలగించారు. మరో కన్నుకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు.

అనంతరం మెదడులో రక్తం గడ్డకట్టి ఉండటాన్ని గుర్తించిన డాక్టర్లు.. బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. అప్పుడే కత్తి మహేష్ కోమాలోకి వెళ్లారు. జూలై 10వ తేదీ తుది శ్వాస విడిచారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు