కత్తి మహేష్ కళ్లు, ముక్కు నుంచి రక్తం.. నోట్లోకి పైపులు.. తలకు పెద్ద బ్యాండేజ్..

కత్తి మహేష్ కళ్లు, ముక్కు నుంచి రక్తం.. నోట్లోకి పైపులు.. తలకు పెద్ద బ్యాండేజ్..

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కంటెనర్ ను బలంగా ఢీకొనటంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ లో నెల్లూరు మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో డాక్టర్లు చికిత్స చేస్తున్నారు.

ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న కత్తి మహేష్ ఫొటో బయటకు వచ్చింది. అభిమానులు, మిత్రులు, శత్రువులు అందరూ షాక్ అయ్యారు. ముక్కు నుంచి రక్తం కారుతుంది. కళ్లకు పెద్ద బ్యాండేజ్ వేశారు. తల చుట్టూ బ్యాండెజ్ కట్టి ఉంది. నోట్లో పైపులు వేసి ఉన్నాయి. ఈ ఫొటో చూసి అభిమానులు ఆందోళన పడుతున్నారు.

కంటికి శస్త్ర చికిత్స – చైన్నైకి తరలింపు

ప్రమాదం కారణంగా కళ్లు, ముక్కు దగ్గర తీవ్రమైన గాయాలు అయినట్టు తెలుస్తుంది. ఈ కారణంగా నెల్లూరు సింహపురి హాస్పటల్లో ఆయన ముక్కుకు చికిత్స చేసిన వైద్యులు, కంటికి శస్త్ర చికిత్స నిమిత్తం చెన్నైలోని శంకర నేత్రాలయంకు తరలించనున్నారు. ప్రస్తుతానికి ప్రమాదం ఏమి లేదని సన్నిహితులు చెబుతున్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ ఆరోగ్యంగా తిరిగి రావాలని.. వేగంగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు అభిమానులు. త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఫేస్ బుక్ వేదికగా కోరుకుంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు