ప్రత్యక్ష రాజకీయాల్లోకి కత్తి మహేష్ : తిరుపతి ఉప ఎన్నిక సాక్షిగా వైసీపీకి ప్రచారం

ప్రత్యక్ష రాజకీయాల్లోకి కత్తి మహేష్ : తిరుపతి ఉప ఎన్నిక సాక్షిగా వైసీపీకి ప్రచారం.సోషల్ మీడియాలో న్యూట్రల్ గా ఉన్నట్టు ఉంటూనే ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి ఎల్లప్పుడు పరోక్షంగా మద్దతు తెలిపే కత్తి మహేష్ తిరుపతిలో జరగనున్న ఉపఎన్నికల సాక్షిగా ప్రత్యక్ష రాజకీయాల్లో రానున్నాడు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి కత్తి మహేష్ : తిరుపతి ఉప ఎన్నిక సాక్షిగా వైసీపీకి ప్రచారం
  • తిరుపతి ఉపఎన్నిక సాక్షిగా వైసీపీకి ప్రచారం చేయనున్న కత్తిమహేష్
  • రత్నప్రభకు వ్యతిరేఖంగా ఏప్రిల్ 2 నుండి ప్రచారం చేయనున్న మహేష్
  • సోదరుడు గురుపూర్తి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
సోషల్ మీడియాలో న్యూట్రల్ గా ఉన్నట్టు ఉంటూనే ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి ఎల్లప్పుడు పరోక్షంగా మద్దతు తెలిపే కత్తి మహేష్ తిరుపతిలో జరగనున్న ఉపఎన్నికల సాక్షిగా ప్రత్యక్ష రాజకీయాల్లో రానున్నాడు. తిరుపతి ఉపఎన్నిక సాక్షిగా, వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని, ఏప్రిల్ 2 నుండి తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయబోతున్నాని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
ఇదే విషయంపై తన ఫేస్ బుక్ అకౌంట్ లో కత్తి మహేష్ ఈ విధంగా రాసుకొచ్చాడు, ”  కేవలం ఉపకులం మీద అభిమానంతో, దళితజాతికి సమూలంగా కీడుచేసే బీజేపీ-జనసేనకు. నాకు కత్తి రత్నప్రభ గారిపై ఉన్న వ్యక్తిగత అభిమానంకోసం తిరుపతి బై-ఎలెక్షన్స్ లో వారికి మద్దత్తు ఇవ్వను. నా సపోర్ట్ సోదరుడు డాక్టర్ గురుమూర్తి గారికే. వైసీపీకే. ఏప్రిల్ 2 నుంచీ క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడానికి తిరుపతి చేరుకుంటాను. నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసే మిత్రులు, శ్రేయోభిలాషులు నావెంట ఉన్నారని సంతోషంగా తెలియజేస్తున్నాను.
Sugerly Point : కత్తి మహేష్ పెట్టిన పోస్ట్ ప్రకారం, రత్నప్రభ తన సామాజిక వర్గంలోని ఉపకులానికి చెందిన వ్యక్తి అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక తిరుపతిలో రత్నప్రభ సామాజిక వర్గాన్ని వైసీపీ తన వైపు తిప్పుకోవాలంటే అందుకు సరైన వ్యక్తి కత్తిమహేశ్ కాబట్టి, అతన్ని ప్రత్యక్ష రాజకీయాల్లో లాగుతున్నట్టు స్పష్టంగా అర్థం అవుతుంది.
Sugerly -News,Politics,Fact Check,Viral,Life Style and Film News
మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు