బిగ్ బాస్ ఫేక్ రియాల్టీ షో – అందులో పాల్గొంటే జీవితాలు నాశనం

బిగ్ బాస్ ఫేక్ రియాల్టీ షో - అందులో పాల్గొంటే జీవితాలు నాశనం

biig boss show kavitha
biig boss show kavitha

బిగ్ బాస్ ఫేక్ రియాల్టీ షో – అందులో పాల్గొంటే జీవితాలు నాశనం

బిగ్ బాస్ షో అనగానే ఎంతో ఆతృత, ఉత్సాహం చూపించారు. బయట ప్రపంచానికి దూరంగా.. కనీసం సెల్ ఫోన్ అందుబాటులో లేకుండా.. టీవీ లేకుండా.. కాలక్షేపానికి కావాల్సినవి ఏవీ లేకుండా కొత్త వ్యక్తుల మధ్య అన్ని రోజులు ఉండాలంటే మాటలా.. మొదట్లో వచ్చిన డైలాగ్స్ ఇవి. షో.. రానురాను.. సీజన్స్ పెరిగే కొద్దీ ఆడియన్స్ లోనూ మార్పు వచ్చింది. ఏదో రియాల్టీ షో.. నిజాయితీ కంటే హైప్ ఎక్కువ ఉంటుంది.. కల్పితాలు ఉంటున్నాయనే ఫీలింగ్ వచ్చేసింది.

హిందీ 14 సీజన్స్.. తెలుగులో నాలుగు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. సీజన్ జరిగే కొద్దీ.. ఆడియన్స్ లో సీరియస్ నెస్.. ఏదో కాలక్షేపం కోసం అన్నట్లు చూస్తూ వస్తున్నారు. ఇదంతా తెర మీద కనిపించేది.. తెర వెనక ఎలా ఉంటుంది అనేది ఓ నటి చెప్పిన సత్యం.. ఇప్పుడు సంచలనంగా మారింది.

హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటి కవిత కౌశిక్. ఈ షోపై విరుచుకుపడింది. అంతా డమ్మీ షో.. రియాల్టీ కాదు.. ఫేక్ రియాల్టీ షో అని స్పష్టం చేసింది. రియాల్టీ షో అంటే నేచురల్ గా ఉండాలి.. ఇక్కడ మేకప్స్ వేస్తారు.. ఎలా నడుచుకోవాలో చెబుతారు.. ఎవరు ఎలాంటి పాత్ర పోషించాలో ముందే ఫిక్స్ అవుతుంది.. ఎవరు ఎలాంటి బట్టు వేసుకోవాలో చెబుతారు.. ఎలాంటి మాటలు మాట్లాడాలో కూడా వాళ్లే ఫిక్స్ చేస్తారు.. మన క్యారెక్టర్ ను వాళ్లు డిసైడ్ చేసి.. వాళ్లకు తగ్గట్టుగా ఆడియన్స్ లో మనల్ని ప్రజెంట్ చేస్తారు.. దీని వల్ల మన ఒరిజినల్ క్యారెక్టర్ పోయి.. డమ్మీ క్యారెక్టర్ ను ప్రజలు ఊహించుకుంటారు అని చెబుతోంది నటి కవిత కౌశిక్.

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాస్తవ ప్రపంచంలో మనల్ని ఊహించుకునే విధానం వేరుగా ఉంటుందని.. దీంతో మానసిక సంఘర్షణతోపాటు.. మనలోని ఒరిజినాటికీ పోయి అటూ ఇటూ కాకుండా పోతాం అంటోంది నటి కవిత. బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది వెలుగులోకి వచ్చారని పబ్లిసిటీ చేస్తుంటారని.. నిజానికి చాలా మంది జీవితాలు నాశనం అయ్యాయని చెబుతోంది.

బిగ్ బాస్ అనేది రియాల్టీ షో కాదు.. ఫేక్ రియాల్టీ షో అంటోంది ఈ నటి మాటలు నిజమే అంటూ నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో చెబుతుండటం విశేషం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు