కేసీఆర్ రైతులను మోసం చేశారు.. ఇదిగో ఆధారాలు

కేసీఆర్ రైతులను మోసం చేశారు.. ఇదిగో ఆధారాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా వివిధ రైతు సంఘాలు, పలు రాజకీయ పార్టీలు భారత్ బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ బంద్ కు టీఆర్ఎస్ కూడా మద్దతు పలికింది. టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ లో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ బంద్ కు మద్దతు ప్రకటించడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు.

రైతులను దారుణంగా మోసం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా బంద్ నిర్వహించడం విడ్డురంగా ఉందని తెలిపారు. ఈ విషయమై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. రైతుల భూము కబ్జా పెట్టి రియల్ దందా నడిపిన టీఆర్ఎస్ ప్రభుత్వం భారత్ బంద్ లో పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సన్న రకం వరిధాన్యం పండించమన్న కేసీఆర్.. పండించిన తరువాత రైతుల నుంచి కొనడంలో విఫలమయ్యారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రైతులకు మేలు చేసేవని అన్నారు. కొన్ని పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం పనిచేస్తున్నాయని రాజాసింగ్ విమర్శించారు. తమ పంటను ఇష్టం వచ్చిన ధరకు ఇష్టం వచ్చిన దగ్గర అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తే, కొన్ని పార్టీలకు నచ్చడం లేదని.. రైతు ఎదగడం వారికీ ఇష్టం లేదని రాజాసింగ్ అన్నారు. మోడీ ఏది చేసిన రైతుల మేలుకోరి చేస్తారని వ్యాఖ్యానించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు