నాడు కవిత.. నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. కేసీఆర్ కుటుంబాన్ని వెంటాడుతున్న ఓటములు

నాడు కవిత.. నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. కేసీఆర్ కుటుంబాన్ని వెంటాడుతున్న ఓటములు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గాంధీనగర్ డివిజన్ ఇంచార్జిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ ఓడిపోయారు. సీఎం కేసీఆర్ కుమార్తెగా.. హైదరాబాద్ లో ఓ డివిజన్ ను గెలిపించలేకపోవటం

14 ఏళ్ల ఉద్యమం.. ఏడేళ్ల రాష్ట్ర పరిపాలనలో సీఎం కేసీఆర్ కుటుంబం తిరుగులేని శక్తిగా తెలంగాణలో అవతరించింది. ఇప్పుడు గాలి వెనక్కి వీస్తుందా.. ఏ కుటుంబం నుంచి అయితే విజయాలు వరించాయో.. ఆ కుటుంబం నుంచే ఓటములు ఎదురవుతున్నాయా అంటే.. పరిణామాలు అలాగే అనిపిస్తున్నాయి. బ్రీఫ్ గా టైం లైన్ చూద్దాం…

2019 లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట కవిత ఓడిపోయారు. కేసీఆర్ కుటుంబంలో ఓడిపోయిన మొదటి వ్యక్తి ఈమె.

మొన్నటికి మొన్న దుబ్బాక ఎన్నికల ఇంఛార్జిగా ఉన్న అల్లుడు, మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ప్రయత్నించినా.. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తప్పలేదు. కేసీఆర్ అల్లుడుగా.. కుటుంబ సభ్యుడుగా రెండో ఓటమిని ఇచ్చారు.

ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కుమారుడు, మంత్రి కేటీఆర్ రూపంలో మరో ఓటమి. 100 సీట్లు ఖాయంగా గెలుస్తాం అని ఢంకా బజాయించినా.. మేయర్ పీఠం ఖాయం అని ధీమా వ్యక్తం చేసినా.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్నీ తానై నడిపించినా ఘోర ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో 99 సీట్లు గెలిస్తే.. ఇప్పుడు అది 56కు పడిపోయింది. పొత్తు లేకుండా మేయర్ పీఠం దక్కేలా లేదు.

మరో విశేషం ఏంటంటే.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గాంధీనగర్ డివిజన్ ఇంచార్జిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ ఓడిపోయారు. సీఎం కేసీఆర్ కుమార్తెగా.. హైదరాబాద్ లో ఓ డివిజన్ ను గెలిపించలేకపోవటం అంటే మాటలు కాదు కదా..

అప్పుడు కుమార్తెతో మొదలైన ఓటమి.. అల్లుడు రూపంలో మరింత దిగజారి.. కొడుకు రూపంలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది టీఆర్ఎస్ పార్టీ. దీని అంతటకీ కారణం ఏంటో తెలుసా.. పునాది లేకుండా జరిగిన పార్టీ నిర్మాణమే.. వ్యవస్థ నడవాలి కానీ వ్యక్తి నడిపిస్తే ఎలా ఉంటుంది అనటానికి ఇదో ఎగ్జాంపుల్..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు