కోకాపేట అమ్మకాల్లో ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందా?

కోకాపేట అమ్మకాల్లో ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందా?

కోకాపేట అమ్మకాల్లో ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందా?

కోకాపేట భూముల్లో కాసుల పంట.. సిరులు కురిపించాయి అని పెద్ద హెడ్డింగ్స్ పెట్టాయి పత్రికలు, టీవీలు. కాకపోతే ఇక్కడే ఒక్క లాజిక్ మిస్ అయ్యారు అంటున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కోకాపేట భూములు దక్కించుకున్న వారందరూ కేసీఆర్ ఫ్యామిలీ ఆప్తులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు అని ఆధారాలతో వెల్లడించిన తర్వాత అందరికీ ఇప్పుడు ఇదే డౌట్ కొడుతుంది.

కోకాపేటలో ఎకరం భూమి 55 కోట్లు అని అందరూ అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని పత్రికలు, టీవీలు హైలెట్ చేశాయి. వాస్తవం ఏంటంటే.. 49 ఎకరాల్లో కేవలం ఎకరం 60 సెంట్లు మాత్రమే ఎకరం 60 కోట్ల లెక్కన కొనుగోలు చేశారు. మిగతా భూమిని అంతా కేవలం 31 కోట్లకు మాత్రమే ధర పలికిందన్నారు.

మెట్రోపొలిస్ అనే ఈ డెవలప్ మెంట్ ల్యాండ్ లో 49 ఎకరాలు మొత్తం పక్కపక్కనే ఉన్నాయి. అన్ని ప్లాట్లకు 100 అడుగుల రహదారి ఉంది. ఒకే భూమిలోని.. పక్కపక్కనే ఉన్న ప్లాట్ల మధ్య ఎకరం 30 కోట్ల రూపాయలు ఎలా ధర తగ్గిపోతుందని లాజిక్ బయటకు తీశారు రేవంత్ రెడ్డి.

ఎకరం 60 కోట్ల లెక్కన అమ్మితే 3 వేల కోట్లు రావాల్సి ఉందని.. అయితే ప్రభుత్వానికి వచ్చింది కేవలం 2 వేల కోట్లు మాత్రమే ఉన్నారు. కేవలం ఒక ఎకరాన్ని 60 కోట్లు అమ్మినట్లు చూపించి.. మిగతా 48 ఎకరాలకు సరాసరి 30 కోట్ల లెక్కనే దక్కించుకున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి. భూములు బంగారం ఎలా మార్చారని ప్రశ్నించారు. కేసీఆర్ చెబుతున్నట్లు బంగారు తునక తన కుటుంబానికి వెళ్లిందన్నారు. కోకాపేట భూము టెండర్లులో పాల్గొన్న కంపెనీలు అన్నీ కేసీఆర్ బినామీలే ఉన్నారన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు