కృషి ఉంటే లక్ష్యం నీ బానిస.. పూరి గుడిసెలో ఉంటూ.. నైట్ వాచ్ మెన్ గా చేస్తూ.. IIM టీచర్ గా ఎదిగాడు..

కృషి ఉంటే లక్ష్యం నీ బానిస.. పూరి గుడిసెలో ఉంటూ.. నైట్ వాచ్ మెన్ గా చేస్తూ.. IIM టీచర్ గా ఎదిగాడు..

Kerala man, Ranjith Ramachandran’s remarkable life journey
Kerala man, Ranjith Ramachandran’s remarkable life journey

కృషి ఉంటే లక్ష్యం నీ బానిస.. పూరి గుడిసెలో ఉంటూ.. నైట్ వాచ్ మెన్ గా చేస్తూ.. IIM టీచర్ గా ఎదిగాడు..

కృషితో నాస్తి దుర్భిష్టం.. కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు అని పెద్దలు ఊరికే చెప్పలేదు.. పట్టుదల ఉంటే లక్ష్యం నీ కాళ్ల దగ్గరకు వస్తుంది అని చెప్పటానికి ఈ సక్సెస్ స్టోరీనే నిదర్శనం..

ఇతని పేరుతో రంజిత్ రామచంద్రన్. వయస్సు 28 సంవత్సరాలు. కేరళ రాష్ట్రంలోని కసర్ గాడ్ ఇతని స్వగ్రామం. అతని తల్లి రోజువారీ కూలీగా పని చేస్తుండగా.. తండ్రి టైలర్ వృత్తిలో ఉన్నాడు. ఇతనిది పూరి గుడిసె. ఆ ఇంటికి తలుపులు లేవు. వర్షం వస్తే ఇంట్లో నీళ్లు పడకుండా టార్పాలిన్ పట్ట కప్పారు. ఈ ఇంట్లోనే రంజిత్ రామచంద్రన్ పుట్టాడు. ఇక్కడే పెరిగాడు.. ఈ ఇంట్లోనే తిన్నాడు.. పడుకున్నాడు.. 28 ఏళ్లుగా ఈ ఇంట్లో ఎంతో ఆనందంగా గడిపాడు. ఏనాడు ఆత్మవిశ్వాసాన్ని.. చదువును వదిలిపెట్టలేదు.

రంజిత్ తల్లిదండ్రులు 5వ తరగతి వరకు మాత్రమే చదివారు. కుమారుడు, కుమార్తెను బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే కసరగాడ్ లోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాకపోయినా.. చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఎకనామిక్స్ లో డిగ్రీ చదువుకుంటున్న సమయంలోనే.. ఇంట్లోని ఆర్థిక పరిస్థితుల వల్ల పనతూర్ సిటీలోని టెలిఫోన్ ఎక్చేంఛ్ దగ్గర నైట్ వాచ్ మెన్ గా పని చేయటం మొదలుపెట్టాడు. వాచ్ మెన్ గా వచ్చే డబ్బులతో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు. అలాగే మూడేళ్లు డిగ్రీ కంప్లీట్ చేశాడు రంజిత్ రామచంద్రన్.

పీహెచ్ డీ చేయాలనే లక్ష్యంతో.. ఐఐటీ మద్రాస్ లో పీహెచ్ డీకి అప్లయ్ చేశాడు. అక్కడ భాష సమస్యగా మారింది. రామచంద్రన్ మళయాళీ.. అక్కడ తమిళం.. ఈ సమయంలోనే తనకు గైడ్ గా ఉన్న సుభాష్ శశిధరన్ చాలా సాయం చేశారు. ఎకనామిక్స్ లో పీహెచ్ డీ పూర్తి చేయటానికి గైడ్ సాయంతో విజయం సాధించాడు రామచంద్రన్. పీహెచ్ డీ చేస్తున్న సమయంలోనే వచ్చే స్కాలర్ షిప్ డబ్బులను ఇంట్లో తల్లిదండ్రులకు పంపించటంతోపాటు.. కొంత మొత్తాన్ని తన చెల్లెలు రంజిత చదువు కోసం సాయం చేశాడు.

పీహెచ్ డీ కంప్లీట్ అయిన తర్వాత.. ఎకనామిక్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కోసం అప్లయ్ చేయటం మొదలుపెట్టాడు. ఐఐటీ రాంచీ, బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో ఉద్యోగం దరఖాస్తు చేసుకున్నారు. రెండు యూనివర్సిటీల నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది. అయితే బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు.

రంజిత్ రామచంద్రన్ కథ కేరళ ప్రజలను కదిలించింది. ఒక్క కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా అతన్ని ప్రేరణగా తీసుకుంటుంది. ఇప్పుడు మీ లక్ష్యం ఏంటీ అని అడిగితే.. మా అమ్మనాన్నలు ఉంటున్న.. నేను పుట్టిన ఆ ఇంటిని తిరిగి కట్టించాలి.. వర్షం పడితే తడవకుండా ఉండాలి.. అమ్మనాన్న మూడు పూజల హాయిగా తిండి తినాలి అంటున్నాడు..

కృషి, పట్టుదల ఉంటే.. 28 ఏళ్లలో లక్ష్యం నీకు బానిస అవుతుంది అని నిరూపించాడు రంజిత్ రామచంద్రన్.. కష్టాలు మనం చూసేదాన్ని బట్టి ఉంటాయి.. వాటికి భయపడితే ఇలాంటి విజయాలు ఎలా వస్తాయి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు