నవ వధువు హత్య కేసులో ఊహించని మలుపు.. భర్త ప్రేయసి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే

ఖమ్మం జిల్లాలో నవ వధువు హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యకేసులో ఊహించని ఘటన చోటుచేసుకుంది. హత్య చేసిన నాగశేషు రెడ్డి మరో యువతితో ప్రేమలో ఉన్నాడని పోలీసులు నిర్దారించారు. ఆ యువతి హత్యకు గురైన నవ్యరెడ్డికి సోదరీ అని పోలీసులు గుర్తించి ఆమెను విచారించేందుకు వారి ఇంటికి వెళ్లారు పోలీసులు. ప్రాధమికంగా కొన్ని ప్రశ్నలు అడిగారు. అవసరమైతే మళ్లివస్తామని పోలీసులు తెలిపారు. అయితే ఇంతలోనే ఏమైందో తెలియదు. ఆ యువతి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. దింతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఖమ్మం జిల్లా తొండలగోపవరం వద్ద నాగశేషు రెడ్డి ప్రియురాలు, ఆయన మేనమామ కూతురు అయిన వెనీలా ఆత్మహత్య చేసుకుంది. దింతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.

కాగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెనికి చెందిన నాగ శేషు రెడ్డికి మేనమామ కూతురు నవ్య రెడ్డితో రెండు నెలల క్రిందట పెళ్లయింది. నాగ శేషు రెడ్డి బెంగళూరులో ఉద్యోగం చేస్తుంటాడు. నవ్య సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం భార్య నవ్య రెడ్డి కనిపించడం లేదంటూ భర్త నాగ శేషు రెడ్డి ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామశివార్లలోని కుక్కల గుట్ట వద్ద ఓ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. దింతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి నవ్యరెడ్డిదిగా నిర్దారించారు. అనంతరం కేసు విచారణ చేపట్టారు.

ఆమెను భర్త నాగశేషు రెడ్డి హత్య చేసి ఉంటాడన్న అనుమానంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీలో నాగశేషు రెడ్డి, నవ్యరెడ్డిని బైక్ పై తీసుకెళ్లినట్లుగా ఉన్న విసుఅల్స్ ను గుర్తించారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలో నమోదు అయిన దృశ్యాల ఆధారంగా నాగ శేషు రెడ్డి ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆశలు విషయం వెలుగు చూసింది. బుదవారం రాత్రి సమయంలో నవ్య రెడ్డి ని బైక్ పై తీసుకు వచ్చి కుక్కల గుట్ట వద్ద మత్తు టాబ్లెట్ లు ఇచ్చి అనంతరం చున్నితో ఉరి వేసి హత్య వేశాడు. అనంతరం నవ్యరెడ్డి ఫోన్ నుంచి తండ్రికి సందేశం పంపాడు. బీటెక్ లో బ్యాక్ లాగ్స్ ఉన్నాయని, తనకు భయం అవుతుందని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సందేశం పంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఇక నాగశేషురెడ్డిని విచారిస్తున్న సమయంలోనే ఆయన మేనమామ కూతురు వెనీలా పేరు తెరపైకి వచ్చింది, తనతో ప్రేమలో ఉన్నట్లుగా తెలిపాడు నాగశేషు రెడ్డి. ఈ నేపథ్యంలోనే పోలీసులు వెనీలా ఇంటికి వెళ్లి ప్రాథమిక విచారణ చేశారు. విచారణలో భాగంగానే ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అవసరం అయితే మరోసారి విచారణకు వస్తామనీ, అందుబాటులో ఉండాలని కోరి, వెళ్లిపోయారు. అయితే ఆమె సమీపంలోని తొందగోపవరం రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకేసు తనపైకి కూడా వస్తుందనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. కాగా వెనీలా కూడా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. వెనీలా, నవ్యరెడ్డి, వరసకు అక్కచెల్లలు అవుతారు.

నవ వధువు హత్య కేసులో ఊహించని మలుపు.. భర్త ప్రేయసి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు