కోకాపేట భూములు కొన్నది మైహోం రామేశ్వరరావు కంపెనీలే.. ఆధారాలు బయటపెట్టిన రేవంత్ రెడ్డి

కోకాపేట భూములు కొన్నది మైహోం రామేశ్వరరావు కంపెనీలే.. ఆధారాలు బయటపెట్టిన రేవంత్ రెడ్డి

కోకాపేట భూములు కొన్నది మైహోం రామేశ్వరరావు కంపెనీలే.. ఆధారాలు బయటపెట్టిన రేవంత్ రెడ్డి

కోకాపేట భూముల వేలం వెనక అవినీతి ఉందని.. వేల కోట్ల దోపిడీ జరిగందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కోకాపేటలో 49 ఎకరాలను వేలం వేయగా.. అందులో 17 ఎకరాల 30 కుంటలను దక్కించుకున్నది మైహోం రామేశ్వరరావుకు చెందిన కంపెనీలే అని స్పస్టం చేశారు. ఆక్వా స్పేస్ డెవలర్స్, ఆక్వా స్పేస్ తెల్లాపూర్ డెవలపర్స్, హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అన్నీ మైహోం రామేశ్వరరావు కుమారులవే అన్నారు. ఈ మూడు కంపెనీల్లో డైరెక్టర్లుగా అతని కుమారులు రాజా, శ్యామ్ రావు ఉన్నారని డాక్యుమెంట్లు బయటపెట్టారు. 600 కోట్లకుపై వెచ్చింది ఈ భూములు కైవసం చేసుకున్నారు.

భూముల వేలంలో అంతర్జాతీయ సంస్థలకు భాగస్వాములను చేస్తాం అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు సొంత కంపెనీలకు భూములను దోచిపెడుతున్నారని విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు భూములు వేలం వేస్తే ఆందోళనలు చేసిన కేసీఆర్, కేటీఆర్.. ఇప్పుడు అవే భూములను సొంత కంపెనీలకు తక్కువ ధరకు కట్టబెడుతన్నారని ఆరోపించారు.

సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి చెందిన సొంత కంపెనీ అయిన రాజపుష్ప రియాల్టీస్ కు చెందిన రెండు కంపెనీలు కలిసి తొమ్మిదిన్నర ఎకరాలు కొనుగోలు చేశాయని వివరించారు. సిద్దిపేట కలెక్టరేట్ ఓపెన్ చేయటానికి వెళ్లినప్పుడు కేసీఆర్ కాళ్లు మెక్కింది ఇతనే అని.. కేసీఆర్ ఫ్యామిలీతో వెంకట్రామిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. రాజపుష్ప రియాల్టీస్ కంపెనీల వెనక కేటీఆర్ ఫ్యామిలీ ఉందన్నారు.

ఏడున్నర ఎకరాలు కైవసం చేసుకున్న మన్నె సత్యనారాయణరెడ్డి ఎవరో కాదని.. మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి సోదరుడు అని స్పష్టం చేశారు.

ప్రిస్టేజ్ ఎస్టేట్స్ సంస్థతో కేటీఆర్ కు చీకటి ఒప్పందాలు ఉన్నాయి. బుద్వేల్ లో 50 ఎకరాల భూమి ప్రెస్టేజ్ సంస్థ కొనుగోలు చేశారని.. రియల్ ఎస్టేట్ వెంచర్లకు అనుమతి లేదని.. అయినా కేటీఆర్ లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారని వివరాలు బయటపెట్టారు.

వర్సిటీ ఎడ్యుకేషనల్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ శ్రీ చైతన్య కాలేజీలదే అన్నారు. శ్రీచైతన్య కాలేజీలతో కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయన్నారు. వారి వాటాలు ఉన్నాయని వెల్లడించారు.

కోకాపేటలోని 49 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది అంతా కేసీఆర్, కేటీఆర్ బంధువులే అని.. వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. వేలంలో భూములు దక్కించుకున్న కంపెనీలు అన్నీ మైహోం రామేశ్వరరావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మన్నె సత్యనారాయణరెడ్డి, శ్రీచైతన్య కాలేజీల పరం అయ్యాయన్నారు. ఇందులో కేసీఆర్ ఫ్యామిలీకి వాటాలు ఉన్నాయన్నారు. అంతర్జాతీయ సంస్థలు ఎక్కడ వచ్చాయన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు