రాజకీయ రంగు పులముకున్న మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం : కొల్లు రవీంద్రపై ఎందుకు అనుమానాలు?

రాజకీయ రంగు పులముకున్న మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం : కొల్లు రవీంద్రపై ఎందుకు అనుమానాలు? టీడీపీ పార్టీ సమావేశాల్లో పాల్గొన్న, మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో దిగిన ఫొటోలు బయటకు రావటం కలకలం రేపుతోంది.

kollu ravindra involved in minister perni nani murder attempt?
kollu ravindra involved in minister perni nani murder attempt?

ఏపీ రవాణా, సమాచార శాఖమంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కలకలం రేపుతోంది. అసలు కంటే కొసరు హైలెట్ అవుతోంది. దాడి చేసిన ఎందుకు చంపాలనుకున్నాడు అనేది 24 గంటలు తర్వాత కూడా స్పష్టంగా బయటకు రాలేదు. ఈలోపు ఇది రాజకీయ రంగు పులుముకుంది. మంత్రి పేర్ని నానిపై హత్యకు టీడీపీ కుట్ర అన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

మంత్రిపై హత్యాయత్నం చేసిన బడుగు నాగేశ్వరరావు తాపీ మేస్త్రీగా జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్లుగా ఉపాధి లేకపోవటం వల్లే ఇలా చేశానని చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీలు అంటూ మా పొట్ట కొట్టింది అంటున్నారు. ఇది అతను చెప్పే కారణం అయితే.. బడుగు నాగేశ్వరరావు ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీతో దగ్గరి సంబంధాలు ఉండటం కలకలం రేపుతోంది.

హత్యాయత్నం చేసిన బడుగు నాగేశ్వరరావు సోదరి.. ఉమాదేవి టీడీపీ మండల మహిళా నేతగా కొనసాగుతున్నారు. కొల్ల రవీంద్రలో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. టీడీపీ పార్టీ సమావేశాల్లో పాల్గొన్న, మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో దిగిన ఫొటోలు బయటకు రావటం కలకలం రేపుతోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన రాజకీయ రంగు పులుముకుంది. కొల్ల రవీంద్ర హస్తం లేకుండా ఇలాంటి సాహసం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. పని లేదు అని బాధ చెప్పుకోవటానికి వస్తే ఆయుధంతో ఎలా వస్తాడని.. ఎందుకు దాడి చేస్తాడని అంటున్నారు. దాడి చేసి చంపితే పని దొరుకుతుందా అనే పాయింట్ రైజ్ చేస్తున్నారు. దీనిపై టీడీపీ మాత్రం ఎక్కువగా మాట్లాడటం లేదు. దాడి చేసిన బడుగు నాగేశ్వరరావు సోదరి పార్టీలో కీలక నేతగా ఉండటంతో.. ఆచితూచి స్పందిస్తోంది.

టీడీపీ స్పందిస్తున్న తీరు చూస్తుంటే.. అనుమానాలు బలపడుతున్నాయి అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. నియోజకవర్గం ప్రజల్లోనూ ఇదే టాక్ నడుస్తుండటం విశేషం. కొన్ని నెలల క్రితమే కొల్లు రవీంద్ర ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకు వచ్చారు. ఆరు నెలల్లో మళ్లీ మరో హత్యాయత్నం కేసులో ఆరోపణలు, విమర్శలు రావటం సంచలనంగా మారింది.

నిందితుడు బడుగు నాగేశ్వరరావుకు టీడీపీతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నా.. కొల్లు రవీంద్రతో ఉన్న సంబంధాలు, దాడి వెనక రాజకీయ కోణాన్ని మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. పోలీస్ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అప్పటి వరకు అన్నీ అనుమానాలు, ఊహాగానాలే…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు