బిగ్ బ్రేకింగ్ : బీజేపీలోకి కోమటిరెడ్డి బ్రదర్స్ – సీరియస్ గా చర్చలు

విజయశాంతి తర్వాత.. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా బీజేపీలో జాయిన్ అవుతారని అంటున్నారు.

దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలుపు తర్వాత కాంగ్రెస్ పరిస్థితి అయోమయంలో పడింది. ఇప్పటికే రాములమ్మ విజయశాంతి సొంత గూటికి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ఒకసారి ఆమెతో భేటీ అయ్యి చర్చలు జరిపారు. దీపావళి తర్వాత ఎప్పుడైనా సరే విజయశాంతి బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇదే దూకుడును కొనసాగిస్తూ.. మరింత మందిని పార్టీలోకి లాగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది బీజేపీ

ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి బ్రదర్స్ ను పార్టీలోకి లాగేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల బీహార్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చావుదెబ్బ తిన్నది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లోనూ బీజేపీ హవా నడిచింది. కాంగ్రెస్ నాయకత్వ లోపాన్ని గుర్తించిన నేతలు.. తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో రాజకీయంగా బలంగా ఉండి.. నల్గొండ జిల్లాలో కీలక నేతలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొన్నేళ్లుగా మార్పులు లేవు. పార్టీని గాడిన పెట్టే చర్యలు తీసుకోవటం కూడా లేదు. ఇటీవలే రాష్ట్ర వ్యవహారాలకు ఠాగూర్ ను నియమించారు. ఆయన వరస భేటీలు అవుతున్నా.. పార్టీని నడిపించే నేతల విషయంలో మీనవేషాలు లెక్కిస్తున్నారు. ఇంకా సీనియర్స్, కురు వృద్ధులనే నమ్ముకుని నడపాలని చూస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కేవలం 22 వేల ఓట్లు మాత్రమే సాధించింది. చెరుకు ముత్యంరెడ్డి వారసత్వంగా వచ్చిన ఆయన కుమారుడికే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక పార్టీలో ఉండి ఉపయోగం ఏంటీ అంటున్నారు. బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్ ను కాదనకుండా.. వెంటనే వెళ్లిపోవాలని డిసైడ్ అయినట్లు బాగా ప్రచారం జరుగుతుంది.

విజయశాంతి తర్వాత.. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా బీజేపీలో జాయిన్ అవుతారని అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు