ఈసారి పక్కా : బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఆర్థికంగా, రాజకీయంగా, వర్గం, కులం పరంగా ఇది కాషాయ దళానికి ప్లస్ పాయింట్. ఊగిసలాటలో ఉన్న రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావటంలో....

komatireddy rajgopal reddy join bjp
komatireddy rajgopal reddy join bjp

తెలంగాణ బీజేపీకి కిక్ ఇచ్చే విధంగా.. నల్గొండ జిల్లాలో పార్టీ బలోపేతానికి కావాల్సిన అండ, దండగా ఉండే లీడర్ కోసం చేసిన అన్వేషణ ఫలించింది. మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే చర్చలు అన్ని ముగిశాయి. ముహూర్తం ఫిక్స్ చేసుకుని.. మూడు రంగులు వదిలేసి.. కాషాయ రంగు జెండా కప్పుకోవటం ఒక్కటే మిగిలి ఉంది. బీజేపీ అగ్రనేతల గ్రీన్ సిగ్నల్, హామీ మేరకు అన్ని ముగిశాయి.

అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ చీఫ్ రాదు అని కన్ఫామ్ అయిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారంట. ఇప్పుడే కాదు.. ఏడాది క్రితం సైతం ఇలాంటి వార్తలే వచ్చాయి. ఇప్పుడు మాత్రం అది ఫైనల్ అయ్యింది. రెండోసారి కాంగ్రెస్ ఓడిపోయినప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైఖరిపై అసంతృప్తిగానే ఉన్నారు.

అన్నయ్య వెంకటరెడ్డితోనూ అంటీముట్టనట్లు ఉంటున్నారనే వార్తలు వచ్చినా.. వాటిని కొట్టిపారేస్తూ వచ్చారు. అన్నయ్య కోసం ఇన్నాళ్లు ఆగినా.. అనుకున్న పీసీసీ చీఫ్ పదవి రాకపోవటంతో తనదారి తాను చూసుకుంటున్నారు.

రాజగోపాల్ పార్టీ బీజేపీలో చేరితే నల్గొండ జిల్లాలో బీజేపీ బలమైన నాయకుడి దొరికినట్లే. ఆర్థికంగా, రాజకీయంగా, వర్గం, కులం పరంగా ఇది కాషాయ దళానికి ప్లస్ పాయింట్. ఊగిసలాటలో ఉన్న రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావటంలో.. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నేతలు బాగా కృషి చేశారంట.

ఏడాది కాలంగా బీజేపీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని వార్తలు వస్తున్నా.. ఈసారి మాత్రం పక్కా. డిసైడ్ అయిపోయింది. కన్ఫామ్ గా ఆయన చేరుతున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు