కాంగ్రెస్ పార్టీకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం ఆయన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్లు కేటాయించిన నాటి నుంచి విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా గత పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల స్థానం నుంచి పోటీచేసిన విశ్వేశ్వర్ రెడ్డి చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. చివరి వరకు విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధిస్తారని అందరు అనుకున్నారు.. చివరి నిమిషంలో ఫలితాలు తారుమారు కావడంతో రంజిత్ రెడ్డి విజయం సాధించారు. ఇక ఆయన ఏ పార్టీలో చేరుతారు అనే దానిపై స్పష్టత లేదు.. బీజేపీలో చేరుతారని ఆయన అనుచరుల నుంచి సమాచారం వస్తుంది. అయితే రాజకీయాల నుంచి పూర్తిగా దూరం కానున్నట్లుగా మరికొందరు అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు