పెద్ద పులి.. పిల్లిగా మారి.. కుక్కలా ఆడుకుంటే ఇలా ఉంటుంది

పెద్ద పులి.. పిల్లిగా మారి.. కుక్కలా ఆడుకుంటే ఇలా ఉంటుంది.. చెయ్యిని పట్టుకుని ముద్దాడుతూ కనిపించింది పులి. ఇంట్లో కుక్క మనతో ఎంత ఆప్యాయంగా ఉంటుందో అలాగే చేసింది ఈ పులి.

Leopard 'Playing' With People Raises Concerns
Leopard 'Playing' With People Raises Concerns

పులి మాట వింటేనే హడలిపోతాం.. వణికిపోతాం.. పులి అల్లంత దూరంలో కనిపించినా చెమటలు పడతాయి.. అటు నుంచి అటే పరిగెత్తుతాం.. అలాంటిది పులిలో గేమ్స్ ఆటుకుంటే.. పులిని పిల్లిలా మారిపోయి మనతో ఆడుకుంటే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశం రాష్ట్రంలోని తీర్థన్ వ్యాలీకి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పర్యాటకులు అంతా రోడ్డుపైనే వాహనాలు ఆపి.. ప్రకృతి అందాలను చూస్తున్నారు.

సరిగ్గా ఈ సమయంలో.. రోడ్డుపైకి ఓ పులి వచ్చింది. అందరూ భయంతో పరుగులు తీశారు. ఓ ఇద్దరు వ్యక్తులకు మాత్రం వీలు కాలేదు.. దీంతో వారు పులి చూస్తూ అలాగే ఉండిపోయారు. ఓ వ్యక్తి దగ్గరకు వచ్చిన పులి.. ఓ వ్యక్తిపై ఆప్యాయత చూపిస్తూ.. అతనికి హత్తుకుంది. అతని చేయి పట్టుకుని లాగుతూ ఆటలాడింది. పులిని విదుర్చుకుని పక్కకు వస్తున్న ఆ వ్యక్తి వెంటనే నడిచింది.

ఆ తర్వాత మరో వ్యక్తి దగ్గరకు కూడా వెళ్లింది. అతని చెయ్యిని పట్టుకుని ముద్దాడుతూ కనిపించింది పులి. ఇంట్లో కుక్క మనతో ఎంత ఆప్యాయంగా ఉంటుందో అలాగే చేసింది ఈ పులి.

ఈ రెండు వీడియోలను చూసిన ఫారెస్ట్ అధికారులు, జంతు శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పులి ప్రవర్తనకు షాక్ అవ్వటంతోపాటు దానికి ఏమైందీ అని నోరెళ్లబెడుతున్నారు. మనుషులు పెంచిన జంతువుల ప్రవర్తన వలే ఉందని.. ఆ పులిని ఎవరైనా పెంచి ఉంటారని భావిస్తున్నారు. అడవి జంతువులను పెంపుడు జంతువులుగా పెంచితే ఇలా ప్రవర్తిస్తాయని అంటున్నారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు