తిరుపతి కౌంటింగ్ కు లైన్ క్లియర్.. దొంగ ఓట్లు వేశారనటానికి ఆధారాలు లేవన్న హైకోర్టు.. 

తిరుపతి కౌంటింగ్ కు లైన్ క్లియర్.. దొంగ ఓట్లు వేశారనటానికి ఆధారాలు లేవన్న హైకోర్టు.. 

tirupati counting
tirupati counting

తిరుపతి కౌంటింగ్ కు లైన్ క్లియర్.. దొంగ ఓట్లు వేశారనటానికి ఆధారాలు లేవన్న హైకోర్టు..

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కౌంటింగ్ మే 2వ తేదీ జరగనున్న క్రమంలో.. టీడీపీ, బీజేపీ వేసిన పిటీషన్లను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. పోలింగ్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా దొంగ ఓట్లు వేయించిందని.. రిగ్గింగ్ కు పాల్పడటం వల్ల ఎన్నికల నిబంధనలకు తుంగలో తొక్కిందని.. ప్రజాస్వామ్య బద్దంగా పోలింగ్ జరగలేదని.. తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రద్దు చేసి.. మళ్లీ ఎన్నిక పెట్టాలని కోరుతూ.. తెలుగుదేశం, బీజేపీ పార్టీలు హైకోర్టులో పిటీషన్లు వేశాయి.

ఈ పిటీషన్లపై విచారించిన ఏపీ హైకోర్టు.. మే 2వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని.. ఈ సమయంలో ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోలేమని.. టీడీపీ, బీజేపీ చెబుతున్నట్లు.. దొంగ ఓట్లు వేశారనటానికి సరైన ఆధారాలు లేవంటూ ఆ పార్టీల పిటీషన్లను కొట్టివేసింది. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను ఆదేశించింది.

తిరుపతిలో దొంగ ఓట్లు వేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన కంప్లయింట్స్ సైతం పక్కన పెట్టేసింది ఈసీ. ఎలాంటి ఆధారాలు లేవని.. పోలింగ్ సక్రమంగానే జరిగిందని.. ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేస్తూ టీడీపీ, బీజేపీ పార్టీలకు సమాచారం ఇచ్చింది.

అటు కేంద్ర ఎన్నికల సంఘం, ఇటు ఏపీ హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో కౌంటింగ్ ప్రక్రియపై ఉన్న అనుమానాలు అన్నీ తొలగిపోయాయి. మే 2వ తేదీన ఎవరు గెలుస్తారు.. గెలిచే పార్టీ మెజార్టీ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు