నాలుగు గంటల్లో 100 కోట్లకు కుమ్మేశారు.. దట్స్ హైదరాబాద్ స్పిరిట్..

నాలుగు గంటల్లో 100 కోట్లకు కుమ్మేశారు.. దట్స్ హైదరాబాద్ స్పిరిట్..

నాలుగు గంటల్లో 100 కోట్లకు కుమ్మేశారు.. దట్స్ హైదరాబాద్ స్పరిట్..

పోటీ పడి కొనటం ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా.. డెడ్ లైన్ దగ్గర పడుతుంటే.. జేబులోని డబ్బులు పోయినా పర్వాలేదు.. చేతిలో బాటిల్ ఉండాలనే తపన పడిన మందుబాబులు ఖర్చు పెడితే ఎలా ఉంటుందో చూపించారు. మే 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల మధ్య.. జస్ట్ నాలుగు గంటల్లో.. గంటకు 25 కోట్లు చొప్పు.. నాలుగు గంటల్లో 100 కోట్ల రూపాయల మందు కొన్నారు.

సిటీ మొత్తం ఉన్న అన్ని మందు షాపులు రద్దీగా మారాయి. బీర్లు అయితే గంటలోనే అయిపోతే.. హాట్ లిక్కర్ మాత్రం కేసులకు కేసులు ఎత్తుకెళ్లారు. ఇక్కడ మేటర్ బ్రాండ్ కాదు.. బాటిల్ ముఖ్యం అన్నట్లు ఏది పడితే అది.. జేబులో ఎంత డబ్బు ఉంటే అంత ఎత్తుకెళ్లిపోయారు మందు ప్రియులు.

మగాళ్లు, ఆడోళ్లు అని వేరు చేయటం చాలా తప్పు.. ఈ కాలంలో మందు అలవాటు అందరికీ ఉంది.. రోడ్ల పక్కన వైన్ షాపుల దగ్గర మాస్ ఉంటే.. మాల్స్, వైన్ మార్టుల దగ్గర పెద్ద ఎత్తున లేడీస్ తమ బ్రాండెడ్ లిక్కర్ ను చాలా చక్కగా ప్యాకింగ్ చేసి ఎత్తుకెళ్లారు.

ఒక్కో మందు ప్రియుడు సరాసరి 3 వేల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా.. కొందరు ఎక్కువ.. మరికొందరు తక్కువ కావొచ్చు.. మొత్తానికి మాత్రం 3 వేల రూపాయలు చొప్పున మందు కొనుగోలు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి.

10 రోజుల లాక్ డౌన్ సమాచారంతో.. మందు షాపులు తెరవరు అనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ ముందుగానే కొనుగోలు చేశారు. తీరా పూర్తి ఉత్తర్వులు వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసింది.. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మందు షాపులు ఓపెన్ చేసి ఉంచుతారు అని..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు