13 వేల గ్రామాల నుండి 4 కోట్ల లీటర్ల పాలు : చిత్తూరు నుండి ఢిల్లీకి పాల ప్రయాణం

4 crore liters of milk from chittore to delhi

లాక్ డౌన్ సమయంలో మనకి తెలియకుండానే సౌత్ సెంట్రల్ రైల్వేతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒక ఘనత సాధించాయి.కరోనాతో దేశం మొత్తం స్తంభించిన పోయిన టైం లో చిత్తూరు జిల్లాలోని రేణీగుంట రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీలోని హాజరత్ నిజాముద్దీన్ వరకు అక్షరాల నాలుగు కోట్ల లీటర్ల పాలను రైల్వే శాఖ సరఫరా చేసింది. ఒక వేళ ఆంధ్రప్రదేశ్ ఈ సాయం చేయకపోతే ఢిల్లీ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఇంకా దగ్గరలో గ్రామాల నుండి ఈ పాలన సేకరించి ప్రత్యేక రైలు ” దూద్ దురంతో” పేరు సరఫరా చేశారు. 13 వేల గ్రామాల నుండి 3 వేల సేకరణ కేంద్రాల సాయంతో ఈ పాలను సేకరించినట్టు అధికారులు వెల్లడించారు.

ఒక్కో రైలు 40 వేల లీటర్ల కెపాసిటీ ఉన్న 6 ట్యాంకర్లతో రేణిగుంట నుండి బయలుదేరి ఢిల్లీకి చేరుకునేవని రైల్వే శాఖ వెల్లడించింది. ఇలా రోజు మార్చి రోజు పద్ధతిలో ఇప్పటి వరకు 167 రైళ్లను నడిపి ఢిల్లీ అవసరాలను తీర్చామని రైల్వే శాఖ తెలిపింది.

లాక్ డౌన్ సమయంలో కోట్ల లీటర్ల పాలను దేశ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గ్రామాలే తీర్చాయంటే అది సాధారణ విషయం కాదు. అందుకే కదా ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణ అని అనేది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు