ఆదాయం కోసం ఇదే మార్గమా – 100 కిలో మీటర్ల కు రూ.90 నుంచి రూ.899 వసూలు చేయనున్న ఏపీ ప్రభుత్వం

ap governament to collect heavy raod taxes

సంక్షేమ అమలు చేయడంలో సూపర్ ఫాస్ట్ గా ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆదాయ మార్గలను పెంచుకునే ఆలోచనలో పడింది. ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు రాష్ట్ర రహాదారులపై తిరిగే వాహానాల నుండి టాక్స్ వసూలు చేయనుంది. వాహానాన్ని బట్టి ప్రతి కిలో మీటర్ దూరానికి 90 పైసల నుండి రూ.8.99 వరకు వసూలు చేయనుంది.

100 కిలో మీటర్ల కు రూ.90 నుంచి రూ.899 అధిక భారం

ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పెడుతున్న ఈ విధానం వల్ల సాధారణ వాహానదారులు ప్రతి ఒక్క కిలో మీటర్ కి 90 పైసలు చెల్లించాలి. అంటే ప్రతి వంద కిలో మీటర్ల ప్రయాణానికి 90 రూపాయలనిమాట. ఇక లారీలు,బస్సులు అయితే ప్రతి కిలోమీటర్ కు 3.55 రూపాయలు అంటే 100 కిలోమీటర్లకు 355 రూపాయలు వసూలు చేస్తారని మాట.

ఇక మల్టీయాక్సిల్ వాహానాలకైతే ప్రతి కిలోమీటరుకు రూ.8.99 చొప్పున ప్రతి వంద కిలోమీటర్లకు 899 రూపాయలు వసూలు చేస్తారని మాట.ప్రతి 60 – 90 కిలో మీటర్లకి ఒక టోల్ బూత్ ఏర్పాటు చేసి ఈ పన్నును వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏపీ స్టేట్ రోడ్ ఫీజ్ పేరిట ఈ పన్ను వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ భావిస్తుంది.

ఏపీ స్టేట్ రోడ్ ఫీజ్ అమల్లోకి వస్తే వ్యతిరేఖత తప్పదా ?

ఏపీ స్టేట్ రోడ్ ఫీజ్ కనుక అమల్లోకి వస్తే ప్రజల నుండి వ్యతిరేఖత తప్పక వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా వసూలు చేయడం వల్ల ప్రైవేట్ వాహానదారులపై అధికభారం పడటమే కాక, సాధారణ మరియు బస్సు ప్రయాణాలు చేసే వారి టిక్కెట్టు ధరలు తప్పక పెరుగుతాయి. ఇక లారీల ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసరాల ధరల్లో సైతం తప్పక మార్పులు వస్తాయి.

ఇప్పటికే పక్క రాష్ట్రాల కంటే అధిక పెట్రోల్ – డీజిల్ రేట్ల కారణంగా విమర్శలు ఎదుర్కుంటున్న ప్రభుత్వం, ఈ విధానాన్ని ప్రవేశ పెడితే జాతీయ రహాదారుల ట్యాక్స్ తో పాటు ఈ ట్యాక్స్ అదనంగా కట్టాల్సిన కారణంగా తీవ్ర విమర్శలు తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు