మదనపల్లి మర్డర్ కేసు : మీడియా ముందుకు వచ్చిన భూతవైద్యుడు

మదనపల్లి మర్డర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయిన శ్రీ దివ్య , అలేఖ్యలకు తాను వైద్యం చేసినట్టు బుగ్గపల్లికి చెందిన భూతవైద్యుడు సుబ్బరామయ్య మీడియా ముందుకు వచ్చాడు.

big twist in madanapalle incident

మదనపల్లి మర్డర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయిన శ్రీ దివ్య , అలేఖ్యలకు తాను వైద్యం చేసినట్టు బుగ్గపల్లికి చెందిన భూతవైద్యుడు సుబ్బరామయ్య మీడియా ముందుకు వచ్చాడు. శ్రీ విద్య , అలేఖ్యలు చనిపోవడానికి ముందు భాస్కర్ , రాజు అనే ఇద్దరు వ్యక్తులు తన వద్దకు వచ్చినట్టు ఆయన వెల్లడించారు. తన వద్దకు వచ్చిన ఆ ఇద్దరు తమ బంధువుల పిల్లలకు ఆరోగ్యం సరిగాలేదని, ఏదో గాలి సోకినట్టు అనుమానం ఉందని వచ్చి చూడాలని కోరారు.

వారిద్దరితో కలసి తాను పద్మజ, పురుషోత్తమ్ ల ఇంటికి వెళ్లానని, తాను వెళ్ళే సమయానికి ఇంటి పై నుండి బిగ్గరగా అరుపులు వినిపించినట్టు వెల్లడించారు. వారి తల్లిదండ్రుల కోరిక మేరకు పూజాసామాగ్రి, తాయత్తులు తీసుకువచ్చేందుకు స్థానికి వెంకటరమణ స్వామి గుడికి వెళ్లామని, తాము తిరిగి ఇంటికి వచ్చేసమయానికి గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆ కుటుంబ సభ్యుల చెవిలో శంఖం ఊదుతున్నట్టు గమనించామని వెల్లడించారు. పద్మజ, పురుషోత్తమ్ లు తనకు 300 రూపాయల నగదు ఇచ్చినట్టు సైతం సుబ్బరామయ్య వెల్లడించాడు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు