కన్న కొడుకునే సైబరాబాద్ పోలీసులకు పట్టించిన కర్నూల్ ఎస్సై

Si father arrest his own son in kurnool

కీలకమైన లోన్ యాప్స్ కేసులో నిందితుడైన కొడుకును పోలీసులకు పట్టించాడో ఎస్సై తండ్రి. కర్నూలుకు చెందిన నాగరాజు, చైనాకు చెందిన లాంబో అనే మరో వ్యక్తితో కలసి ఢిల్లీ కేంద్రంగ లోన్ యాప్స్ పేరుతో యువత నుండి పెద్ద మొత్తం డబ్బులను వసూలు చేశారు. లోన్ యాప్స్ పేరుతో మోసం చేసిన వారిని పట్టుకుంటున్న క్రమంలో లాంబోతో కలసి నాగరాజు చేసిన లావాదేవీలు బయటపడ్డాయి.

నాగరాజు,లాంబో ఇద్దరు కలసి దాదాపు 21 వేల కోట్ల రూపాయల మేర లావాదేవీలను అక్రమంగా జరిపినట్టు అధికారులు గుర్తించారు. అయితే నాగరాజు తండ్రి ఎస్సై కావడంతో ఢిల్లీ నుండి కర్నూలుకు కొడుకును రప్పించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాడు.

అనంతరం పోలీసులు వచ్చే వరకు ఇంట్లోనే ఉండి వారికి నాగరజును అప్పగించాడు. కన్నకొడుకునే పోలీసులకు పట్టించి, అనుబంధాల కంటే చట్టమే ముఖ్యమని నమ్మిన ఆ ఎస్సై తండ్రిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు