మజ్లీస్‌తో కటీఫ్‌ : కేటీఆర్ చెప్పింది నిజమేనా – ప్రజలు నమ్ముతారా ?

kcr and ktr press meet

గ్రేటర్‌ వార్‌లో తామెవరితోనూ పొత్తు పెట్టుకోబోమని.. మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. బల్దియా ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అన్ని పార్టీల్లాగే తమకు ఎంఐఎం కూడా ఒకటని.. అందులో ఇసుమంత కూడా సందేహం లేదని తేల్చిచెప్పారు.

మజ్లీస్‌తో లోపాయకారి ఒప్పందం ఉందనే వాదనల్లో వాస్తవం లేదని.. కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎంఐఎం అభ్యర్థులు నిలబడే స్థానాల్లో నామమాత్రంగా టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తారనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 స్థానాల్లో గెలుపొందామని.. మరో స్థానంలో కేవలం 5 ఓట్ల తేడాతో కోల్పోయామని.. ఉదహరించారు. ఈ సారి పాతబస్తీలో 10 సీట్లు గెలుపొందుతామని తెలిపారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా.. బల్దియా పీఠం తమదే అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 4 వ తేదీన గ్రేటర్‌ పీఠంపై టీఆర్ఎస్‌కు చెందిన మహిళా అభ్యర్థే కూర్చుంటారని.. జోస్యం చెప్పారు.

కేటీఆర్ చెప్పేది నిజమేనా – ప్రజలు నమ్ముతారా ?

కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మజ్లీస్ కి మాకు సంబంధం లేదని చెప్పిన విషయాన్ని ప్రజలు నమ్ముతారా లేదా అనే విషయంపై క్లారిటీ కోసం టీఆర్ఎస్ వర్గాలు ప్రస్తుతం ఎదురుచూస్తున్నాయి. పాతబస్తీలో టీఆర్ఎస్ నుండి అభ్యర్థిత్వన్ని కోరేవారు అనేక మంది ఉన్నారు. MIM తో TRS జట్టు కారణంగా వారు ఇంత కాలం నష్టపోతు వస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ చెప్పిన మాటలపై వారు అనేక ఆశలుపెట్టుకున్నారు.

కేటీఆర్ చెప్పింది నిజమై తమకు పోటీచేసే అవకాశం వస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. MIM – TRS పొత్తు అనేది బహిరంగ రహస్యమే, అలాగే వారిది చెక్కు చెదరని బంధమే అని తెలిసినప్పటికి అద్భుతాలు జరుగుతాయోమోనని ఆశపడుతున్న పాతబస్తీ TRS నేతలు

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు