కర్నూలు : 50 కోట్లకు ఐపీ పెట్టాడు – తెల్లారేపాటికి శవమై తేలాడు

kurnool man dies of big debts

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. కర్నూలు నగరంలో గౌడన్లు, వేర్ హౌస్ లు నడిపే ప్రహ్లాద శెట్టి అనే వ్యక్తి తెల్లారే పాటికి శవమై తేలిన ఘటన చోటుచేసుకుంది.

అంతకు ముందు రోజే ప్రహ్లాదశెట్టి దాదాపు 40 మంది రైతుల వద్ద 50 కోట్లపైగా డబ్బు అప్పుగా తీసుకోని చెల్లించకుండా ఐపీ పెట్టి పారిపోయాడు. ఐపీ పెట్టి పారిపోయిన తర్వాతే రోజే చనిపోయాడు. విషయం తెలుసుకున్న రైతులు, ప్రహ్లాద శెట్టి ఇంటి వద్దకు చేరుకోని తమ అప్పు చెల్లించిన తర్వాత మాత్రమే దహాన సంస్కారాలకు అనుమతి ఇస్తామని గొడవకు దిగారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకోని వారికి సర్థి చెప్పే ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. మేం అందరం చిన్నా,సన్నకారు రైతులమని డబ్బులు ఇవ్వని పక్షంలో ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నారు రైతులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు