దుబ్బాక ఓటమితో ఆత్మహత్య చేసుకున్న అభిమాని – పాడేమోసిన మంత్రి హరీష్ రావు

minister harish rao in dubbaka bye-elections

దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ చేతిలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక పలువురు అభిమానులు, కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు దుబ్బాక నియోజకవర్గంలో నమోదు అయ్యాయి.

పెద్దపల్లికి చెందిన సత్యనారాయణ రెడ్డి గుండెపోటుతో మృతి

కాల్వశ్రీరాంపూర్ కు చెందిన పులి సత్యనారాయణరెడ్డి పార్టీ నాయకులతో కలసి దుబ్బాక ఉపఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గమనిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించారు. బీజేపీ గెలుపు ఖాయం అని ప్రకటించిన మరుక్షణమే,” ఇక బీజేపీ వాళ్లు చేసే హాడావుడిని చూసి తట్టుకోవడం కష్టం”, అని తోటి నాయకులతో చెబుతూ ఒక్కసారి కుప్పకూలిపోయారు. హాస్పటల్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే తుది శ్వాస విడిచారు.

దుబ్బాక ఓటమితో హాత్మచేసుకున్న అభిమాని – పాడేమోసిన మంత్రి హరీష్ రావు

దుబ్బాక ఓటమితో మరో కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన దౌల్తాబాద్ మండలం కొనయిపల్లికి గ్రామంలో చోటు చేసుకుంది. కొనయిపల్లికి చెందిన  కొత్తింటి స్వామి అనే వ్యక్తి హరీష్ రావుకు వీరాభిమాని. దుబ్బాకలో ఓటమిని తట్టుకోలేని స్వామి చెట్టుకు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్వామి కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామి ఇవ్వడమే కాక అతని పాడేను సైతం మోసారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు