కాంగ్రేస్ పార్టీకి సరికొత్త సవాల్ – డబ్బు- శ్రమ వృథా : సైలెంట్ గా ఉండటమే బెటర్

congress party has no chance to win in ghmc

తెలంగాణ గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రేస్ పార్టీకి సరికొత్త ఇబ్బంది తలెత్తింది. ఉన్న 150 డివిజన్లకు నిలబెట్టడానికి సరైనా అభ్యర్థులు లేక ఇబ్బందులు ఎదుర్కుంటుంది. దీనికి తోడు పార్టీలో ఉన్న అనేక మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ , టీఆర్ఎస్ పార్టీల్లో చేరిపోతున్నారు.

కాంగేస్ పార్టీ GHMC ఎన్నికల భాధ్యతను అధిష్టానం రేవంత్ రెడ్డికి అప్పగించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా రేవంత్ ను నియమించే ఆలోచనలో సైతం అధిష్టానం ఉంది. ఈ నేపథ్యంలో GHMC ఎన్నికల్లో రేవంత్ మానియా పని చేసి ఓ 15 – 20 డివిజన్లని కాంగ్రేస్ సాధిస్తే, తామంతా రేవంత్ కింద పనిచేయాల్సి వస్తుందనే ఆలోచనలో సీనియర్లు ఉన్నారు.

ఏటు పోటీ చేసిన డబ్బు ఖర్చు , శ్రమవృద్ధా గెలిచిన పెద్దగా సంపాదించేది ఏం ఉండదు. ఒకవేళ కష్టపడి ప్రచారం చేద్దాం అని అనుకున్నా ఉన్న సమయం చాలా తక్కువ “, ఇది ప్రస్తుతం గ్రేటర్ లో ఉన్న కాంగ్రేస్ నాయకుల తీరు. ఒక వేళ బాధ్యతను నెత్తినవేసుకుంటే తమ చేతి ఖర్చులు ఎక్కడపడతాయో, రాని చోట పెట్టుబడి ఎందుకు అనే ఆలోచనలో ఉన్నారు ప్రతి ఒక్కరు.

సీనియర్ నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి , జగ్గారెడ్డి వంటి వారు సైతం ఈ కారణంతోనే తమకు భాధ్యతలు అప్పచెప్పనందుకు ఆనందంగా ఉన్నారు.చివరికి గ్రేటర్ కాంగ్రేస్ అధ్యక్షుడిగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ సైతం గాంధీ భవన్ వైపు తలెత్తిచూడటం లేదు. పొరపాటున పూసుకుంటే ఎక్కడ తమకు చుట్టుకుంటుందో అనే భయంతో ప్రతి ఒక్కరు ఉన్న కారణంగా ఎన్నికల నామినేషన్లు ముగిసే సమయం దగ్గరపడినప్పటికి ఒక్కరు కూడా గాంధీ భవన్ వైపు తలెత్తి చూడటం లేదు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు