3 సార్లు ఓటమి – 4వ సారి ఎట్టకేలకు ఎమ్మెల్యే గా మారిన విలేకరి

raghunandan rao victory in dubbaka by poles

విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా మారిన ఆ వ్యక్తి  మాధవనేని రఘునందన రావు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి మూడు సార్లు ఓటమి పాలైనప్పటికి పట్టు విడవకుండా ప్రయత్నించి.. ప్రయత్నించి తన నాలుగో ప్రయత్నంలో ఎమ్మెల్యేగా ప్రామాణస్వీకారం చేయడానికి సిద్ధం అవుతున్నాడు రఘునందనరావు.

విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్​ రావు

డిగ్రీ వరకు సిద్ధిపేటలో చదివిన రఘునందన రావు , ఉస్నానియా యూనివర్సీటీ నుండి ఎల్.ఎల్.బీ పట్టాను పొందారు. అనంతరం ఒక ప్రముఖ పత్రికలో విలేకరిగా పని చేస్తూ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. తన చురుకుదనంతో ప్రారంభం నుండే టీఆర్ఎస్ పార్టీలో కీలకవ్యక్తిగా పనిచేశారు.

తెరాసా నుండి పొలిట్ బ్యూరో సభ్యునిగా , మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి, కొన్ని రాజకీయ కారణాల వల్ల 2013 లో టీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన కొద్ది రోజులకే బీజేపీ లో చేరిన ఆయన సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో బీజేపీ బలపడటానికి తీవ్రంగా కృషి చేశారు.

2 సార్లు ఓటమి – 3వ సారి ఎట్టకేలకు ఎమ్మెల్యే గా మారిన విలేకరి

2014, 2018 ఎన్నికల్లో బీజేపీ నుండి అసెంబ్లీకి అలాగే 2019 లోక్ సభఎన్నికల్లో  పోటీ చేసి ఓటమిని చూసినప్పటికి రఘునందన రావు ధైర్యాన్ని ఏ మాత్రం కోల్పోలేదు. టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా ఉన్న దుబ్బాక నియోజకవర్గాన్ని ఛేదించి ఎమ్మెల్యేగా నిలవడానికి తీవ్రంగా కృషి చేశాడు.

ఎప్పుడు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆయన మూడు సార్లు పాలైనప్పటికి నాలుగోసారి విజయం సాధించి దుబ్బాక పీఠం కైవసం చేసుకున్నారు.

ఐపీఎల్ మ్యాచ్​ తరహాలో ఉత్కంఠగా సాగిన ఓటింగ్​లో అధికార పార్టీపై స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. తెరాస జోరు, కాంగ్రెస్ నుంచి పోటీని దీటుగా ఎదుర్కొని విజయం సాధించారు. ఒక విలేకరిగా ప్రయాణం మొదలుపెట్టి ఎమ్మెల్యేగా మారిన రఘునందన రావు బీజేపీకి తెలంగాణలో కొత్త ఊపిరిని ఇచ్చాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు