తింటే 50 – తినకుంటే 100 : వరంగల్లో వెరైటీ హోటల్ లింగాల కేదారి

kedari food court in waragal district

మనం ఎంత తిన్నా , ఏది తిన్నా 50 రూపాయలు మాత్రమే తీసుకునే హోటల్ ఉంటే బాగుటుంది కదా. “బాగుండటం ఏంటి అదిరిపోతుంది, అయినా ఈ రోజుల్లో 50 రూపాయలకి ఒక పూట టిఫినే రావడం లేదు ఇక తిన్నంత భోజనం ఎక్కడ దొరుకుతుంది“, అని కొట్టిపారేయకండి  ఎందుకంటే మన వరంగల్ జిల్లా , హన్మకొండ లో అలాంటి ఒక హోటల్ ఉంది.

ఈ హోటల్లో వెజ్ / నాన్ వెజ్ ఎంత తిన్నా ఏం తిన్నా 50 రూపాయలు కడితే చాలు. అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఒక్క కండిషన్ మాత్రం ఉంది. అదే ” ఎంత తిన్న పెడతాం కానీ పెట్టిన ఫుడ్ ని వేస్ట్ చేసినా ప్లేట్ లో మిగిల్చిన 100 రూపాయలు ఫైన్ కట్టాలి”. ఈ కండిషన్ తెలిసి కూడా సంవత్సరాల తరబడి ఇక్కడ భోజనం చేస్తున్న వారు ఉన్నారు.

తింటే 50 – తినకుంటే 100 వరంగల్ వెరైటి హోటల్ తీరు ఇదే

వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్న ఈ హోటల్ పేరు లింగాల కేదారి ఫుడ్ కోర్టు. గత 25 సంవత్సరాలుగా లింగాల దంపతులు ఈ హోటల్ ను నడుపుతున్నారు. వరంగల్ జిల్లాలోని ప్రతి ఒక్కరికి ఈ హోటల్ సుపరిచితం. ఆహారం వృథా కాకూడదు అనే ఉద్దేశంతో ఈ దంపతులు వినూత్నం ఆలోచించి తింటే 50 తినకుంటే 100 అనే కాన్సెప్ట్ తో హోటల్ ను నడుపుతున్నారు.

ఇక్కడికి వచ్చిన వారికి ఎంత తిన్నా 50 కడితే చాలు, కాని పెట్టించుకున్న ఆహారాన్ని ప్లేట్ లో మిగిలిస్తే మాత్రం ముక్కుపిండి 100 వసూలు చేస్తారు. ఎంత పెద్ద గొడవ జరిగినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా 100 రూపాయలు వసూలు చేస్తారు. హోటల్లో ప్రతి గోడ మీద అన్నం వృథా చేస్తే ఫైన్ కట్టాల్సిందే అని రాసి ఉంటుంది.

ఫైన్ డబ్బును సేవ కోసం ఉపయోగిస్తున్న దంపతులు

ఇలా వసూలు అయిన డబ్బును లింగాల కేదారి దంపతులు అనేక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటారు. తమ వద్ద ఫైన్ కట్టిన వారిలో లాయర్లు , పోలీసులు సైతం ఉన్నారని ఈ దంపతులు గర్వపడుతుంటారు. ఈ సారి ఎప్పుడైనా వరంగల్ వెళ్తే హాన్మకొండలో ఉన్న ఈ  కేదారి ఫుడ్ కోర్టును ఒకసారి తప్పక్ చూసి తిని రండీ

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు