జగన్ రెడ్డి కాదు జాంబీ రెడ్డి : జగన్ నా గడ్డం వెంట్రుక కూడా పీకలేడు అంటున్న లోకేష్

జగన్ రెడ్డి కాదు జాంబీ రెడ్డి : జగన్ నా గడ్డం వెంట్రుక కూడా పీకలేడు అంటున్న లోకేష్

తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ పీకలేరు.. జగన్ తాతే పీకలేకపోయాడు.. జగన్ నా గడ్డంపై ఉన్న వెంటుక్రను సైతం పీకలేడు అంటున్నారు నారా లోకేష్. అచ్చెన్నాయుడితో మాట్లాడిన వీడియో ఫేక్ అని.. ట్రోల్ చేశారని.. కట్ కాపీ పేస్ట్ గా ఉందని.. ఇదంతా సాక్షి మీడియా సృష్టి ఉంటున్నారు లోకేష్.

ఇక్కడ నుండి నేను ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి అని కాకుండా జాంబీ రెడ్డి అని పిలుస్తా, అంటూ మాట్లాడిన లోకేష్. తెలుగు దేశాన్ని, తెలుగు దేశం కార్యకర్తల్ని పూర్తిగా లేకుండా చేయాలని చూస్తున్న జగన్ ని అలానే పిలుస్తా అంటూ నొక్కి నొక్కి చెప్పాడు లోకేష్.

తెలంగాణలో టీడీఎల్పీ విలీనంపై స్పందించిన లోకేష్.. ఇది మామూలే అని.. ఎన్నికలు వచ్చినప్పుడు మళ్లీ గెలుస్తాం అని.. ఆ తర్వాత మళ్లీ విలీనం అవుతారని.. మళ్లీ గెలుస్తాం.. మళ్లీ విలీనం అంటూ వెటకారాలు ఆడారు.

పార్టీ చాలా బలంగా ఉందని.. కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం అని.. పరిగెత్తించి కొడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. కావాలంటే నాపై ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి.. నా వెంట్రుక కూడా పీకలేరని ఛాలెంజ్ చేశారు.

దేవినేని ఉమకు నోటీసులు ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తూ.. డీజీపీ ఖాకీ బట్టలు వదిలేసి వైసీపీ చొక్కా వేసుకోవాలని.. ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని.. అసలు నోటీసులను పట్టించుకోవటం లేదన్నారు.

జగన్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని.. రాత్రికి రాత్రి సూట్ కేసులు మారుతున్నాయని.. ఇసుక, లిక్కర్ మాఫియా నడుస్తుందన్నారు. లోకేష్ మాటలు 3:44 నుంచి మొదలు అవుతాయి. పూర్తిగా చూసేయండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు