ఎల్.రమణ రాజీనామా చేశారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి లైన్ క్లియర్

ఎల్.రమణ రాజీనామా చేశారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి లైన్ క్లియర్

చాలా రోజులుగా వస్తున్న పార్టీ ఫిరాయింపు వార్తలకు చెక్ పెట్టారు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ. టీడీపీకి రాజీనామా లేఖ సమర్పించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఈ లేఖను పంపించారు.

రాజీనామా లేఖ సారాంశం ఇలా ఉంది :

తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నాను.

తెలుుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను.
గత 30 సంవత్సరాలుగా నా ఎదుగుదలకు తోడ్పాటును అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు అంటూ చంద్రబాబుకు రాజీనామా లేఖ సమర్పించారు ఎల్.రమణ

రాజీనామాకు 24 గంటల ముందు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి రమణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. 20 నిమిషాలు చర్చించారు. ఆ తర్వాతే రాజీనామా సమర్పించారు.

టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం గవర్నర్, ఎమ్మెల్యే కోటా కింద ఎనిమిది మంది ఎమ్మెల్సీల నియామకం చేయాల్సి ఉంది. త్వరలోనే వీటిని భర్తి చేయనున్నారు. గవర్నర్ లేదా ఎమ్మెల్యే కోటా కింది ఎల్.రమణ ఎమ్మెల్సీగా శాసనమండలిలో టీఆర్ఎస్ పార్టీ తరపున అడుగు పెట్టనున్నారు.

See also : తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షురాలుగా నందమూరి సుహాసిని

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు