మంచు విష్ణుకు నందమూరి, దగ్గుబాటి, కృష్ణ ఫ్యామిలీల మద్దతు

మంచు విష్ణుకు నందమూరి, దగ్గుబాటి, కృష్ణ ఫ్యామిలీల మద్దతు

మంచు విష్ణుకు నందమూరి, దగ్గుబాటి, కృష్ణ ఫ్యామిలీల మద్దతు

తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ వెనక మెగా ఫ్యామిలీ ఉందన్న విషయం నాగబాబు వ్యాఖ్యలతో క్లారిటీ రాగా.. మంచు విష్ణు ప్యానెల్ కు సినీ ఇండస్ట్రీ ఎవరి మద్దతు ఇస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది.

మంచు విష్ణు స్వయంగా అధ్యక్ష ఎన్నికల్లోకి దిగటంతో.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్వయంగా బరిలోకి దిగారు. నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీల మద్దతు కూడగట్టారు. ఇదే సమయంలో మా మాజీ అధ్యక్షుడు సీనియర్ నరేశ్ తోపాటు కృష్ణ, మహేష్ బాబు ఫ్యామిలీ మద్దతు పూర్తిగా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముందుగా మీడియా ముందుకు వచ్చి ప్రకాష్ రాజ్ ప్యానెల్ హడావిడి చేయటంతోపాటు.. హైప్ రావటాన్ని నిశితంగా పరిశీలిస్తున్న మోహన్ బాబు.. అందుకు ధీటుగా తెర వెనక మంతనాలు, చర్చలతో పెద్ద ఫ్యామిలీ మద్దతు రాబట్టుకోవటంలో విజయం సాధించినట్లు తెలుస్తోంది.

ఈ మూడు కుటుంబాల నుంచి మద్దతు తనకే ఉంటుందన్న నిర్ణయానికి వచ్చిన మంచు విష్ణు.. ప్యానెల్ ప్రకటనతో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు.

సినీ ఇండస్ట్రీలో నందమూరి, దగ్గుబాటి, కృష్ణ ఫ్యామిలీలకు మంచి ఆదరణ ఉంది. వీళ్లందరికీ స్టూడియోలు ఉన్నాయి. రామకృష్ణ, రామానాయుడు, పద్మాలయ స్టూడియోల ద్వారా సుపరిచితులు. నిర్మాతలు, దర్శకులుగా, నటులుగా వీళ్లకు ఉన్న క్రేజ్ ఎక్కువే.

ప్రకాష్ రాజ్ కు ధీటుగా మంచు విష్ణు పోటీ ఇవ్వగలరని.. మెగా ఫ్యామిలీ ప్యానెల్ గెలుపు అంతా ఈజీ కాదని సినీ పెద్దలు విశ్లేషిస్తున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు