నాదెండ్ల మనోహర్ మోజులో ఆ ఇద్దరిని దూరం చేసుకున్న పవన్ కళ్యాణ్ : పార్టీకి దూరం కీలక వ్యక్తులు

నాదెండ్ల మనోహర్ మోజులో ఆ ఇద్దరిని దూరం చేసుకున్న పవన్ కళ్యాణ్ : పార్టీకి దూరం కీలక వ్యక్తులు

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి.. అంతకంటే ముందు నుంచే జనసేనానికి ఇద్దరు వ్యక్తులు అత్యంత ఆప్తులు. ఒకరు రైట్ హ్యాండ్ అయితే.. మరొకరు లెఫ్ట్ హ్యాండ్ గా ఉండేవారు. కుడి, ఎడమ భుజాలుగా పవన్ కల్యాణ్ ను వెంటే ఉన్నారు. పార్టీ వ్యవహారాలతోపాటు వ్యక్తిగత విషయాల్లోనూ సూచనలు, సలహాలు ఇస్తూ.. ముందుకు నడిపించారు. పార్టీ నిర్మాణంలో పవన్ కల్యాణ్ మాటను ఏనాడు వ్యతిరేకించకుండా.. వెన్నంటే ఉన్నారు ఆ ఇద్దరూ..

ఇప్పుడు ఆ ఇద్దరూ పవన్ కల్యాణ్ నుంచి దూరం అయ్యారు. వాళ్లెవరో కాదు.. ఒకరు తోట చంద్రశేఖర్, మరొకరు మాదాసు గంగాధరం. వీళ్లద్దరూ పవన్ కల్యాణ్ ఆప్తులు, సన్నిహితులు. మూడేళ్లుగా ఈ ఇద్దరినీ పక్కనపెడుతూ వస్తున్నారు జనసేనాని. దాదాపు రెండేళ్లుగా తోట చంద్రశేఖర్ దూరంగా ఉంటూ వస్తుంటే.. ఏప్రిల్ 10వ తేదీన మాదాసు గంగాధరం పార్టీకి రాజీనామా చేశారు. తోట చంద్రశేఖర్ మాత్రం రాజీనామా చేయలేదు కానీ.. పార్టీ వ్యవహారాలతోపాటు.. వ్యక్తిగతంగా దూరంగా ఉంటూ వస్తున్నారు.

2019 ఎన్నికల సమయంలో తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధరం ఇద్దరూ కుడి, ఎడమ భుజాలుగా ఉంది.. పవన్ కల్యాణ్ వెంటే నడిచారు. అప్పటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 99 న్యూస్ ఛానల్ ను పవన్ కోసం పెట్టారు తోట చంద్రశేఖర్. ఇక పార్టీ వ్యవహారాలను మాదాసు గంగాధరం సమీక్షించుకునే వారు.

ఏమైందో ఏమో.. 2019 ఎన్నికల తర్వాత అనూహ్యంగా వీళ్లిద్దరినీ పక్కన పెడుతూ వచ్చారు పవన్ కల్యాణ్. ఈ ప్లేస్ లోకి ఎంట్రీ అయిన నాదెండ్ల మనోహర్ అన్నీ తానై వ్యవహరిస్తూ మరింత దగ్గర అయ్యారు. ముందు వచ్చిన చెవుల  కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడిగా ఉంటాయన్న సామెతను నిజం చేస్తూ.. ముందు నుంచీ.. కొన్ని సంవత్సరాలుగా కష్టాల్లో.. నష్టాల్లో.. బాధల్లో.. సంతోషాల్లో వెన్నంటే ఉన్న తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధరంను పవన్ కల్యాణ్ దూరం పెడుతూ వచ్చారు.

జనసేన పార్టీ తరపున తీసుకునే కీలక నిర్ణయాల్లో వీళ్లిద్దరినీ పరిగణలోకి తీసుకోకపోవటంతో.. తోట చంద్రశేఖర్ తన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తాను చేసుకుంటూ అప్పుడప్పుడూ వచ్చి పోతూ ఉన్నారంట. ఇక రాజకీయాలు మాత్రమే చేసే మాదాసు గంగాధరం మాత్రం దీన్ని జీర్ణించుకోలేక పార్టీకి రాజీనామా చేస్తూ.. పవన్ కల్యాణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఏకంగా లేఖ రాశారు.

ఇది పవన్ కల్యాణ్ తప్పా లేక పవన్ కల్యాణ్ ను నమ్మిన వారి తప్పా అనేది ఇప్పుడు ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది. మొత్తానికి లెఫ్ట్, రైట్ హ్యాండ్ గా ఉన్న ఆ ఇద్దరినీ వదులుకోవటం తప్పా.. ఒప్పా అనేది పవన్ కల్యాణ్ కు కాలమే సమాధానం చెబుతుంది అంటున్నారు కార్యకర్తలు, అభిమానులు.

See also : రోశయ్యతో దుర్మార్గంగా వ్యవహరించిన రామోజీరావు : తెలుగు పత్రిక తీరు అప్పుడు-ఇప్పుడు

See also : చంద్రబాబులో ఊహించని మార్పు – ఇకనైనా భజన చేయడం ఆపాలని సీనియర్ నేతలకు హితవు – మార్పు మొదలైందా ఏంటీ ?

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు