మేడిన్ ఆంధ్ర గోల్డ్ – అనంతపురం,చిత్తూరు జిల్లాల్లో బంగారం గనులు

మేడిన్ ఆంధ్ర గోల్డ్ – అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో బంగారం గనులు

ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలపై అన్వేషణ చేస్తోంది. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలను గాడిలో పెట్టిన సర్కార్.. అందుకు కావాల్సిన నిధుల సమీకరణ, ఆదాయంపై సీరియస్ గా ఆలోచిస్తుంది. అందులో భాగంగా ఏ చిన్న విషయాన్ని విస్మరించటం లేదు. ప్రతి అంశాన్ని సూక్ష్మమంగా అధ్యయం చేస్తోంది.

అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని రామగిరి మండలంలో 130 హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు గనులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. భారత్ గోల్డ్ మైన్స్ ఆధ్వర్యంలో కొంతకాలం తవ్వకాలు జరిగాయి. గిట్టుబాటు కావటం లేదనే ఉద్దేశంతో 2001లోనే తవ్వకాలు నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం.

ఇక చిత్తూరు జిల్లా కుప్పం మండలం చిగురుగుంటలో బంగారు గనుల తవ్వకాలకు ఎన్ఎండీసీకి ఇటీవల అనుమతి వచ్చింది ఇటీవల. చిగురుగుంట, మల్లప్పకొండ, బిసానట్టం ప్రాంతాల్లో బంగారం తవ్వకాలకు అనుకూలం అని నిర్ణయించింది ప్రభుత్వం. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని ఈ ప్రాంతాల్లో బంగారం తవ్వకాలు జరపాలని బంగారు గనుల నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్రమంలో వీలైనంత త్వరగా బంగారం గనుల తవ్వకాలకు కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలతోపాటు నిధుల కొరతకు కొంత వరకు పరిష్కారం లభిస్తుందని భావిస్తోంది ప్రభుత్వం. త్వరలోనే బంగారం తవ్వకాలకు కేంద్రం నుంచి అనుమతి రావొచ్చని చెబుతున్నారు మైనింగ్ శాఖ ఉన్నతాధికారి జగన్నాథరావు.

2001లో బంగారం ధర – వెలికతీత మధ్య ధర వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో.. గిట్టుబాటు కాకపోవటం, నష్టం రావటంతో కేంద్రం బంగారం తవ్వకాలను నిలిపివేసింది. ఇప్పుడు మార్కెట్ వ్యాల్యూను పరిగణలోకి తీసుకుంటే.. బంగారం తవ్వకం లాభసాటిగా ఉంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించారు. 2001లో 10 గ్రాముల బంగారం రూ. 4 వేలు ఉంటే.. ఖర్చు రూ. 9 వేలు అయ్యేది. పది గ్రాముల బంగారం తీయడానికి అదనంగా రూ 5వేలు ఖర్చు కావడంతో నిర్వహణ సాధ్యం కాదని గనుల తవ్వకం నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం.

ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యాయి. బంగారం ధర అధికంగా ఉండటంతో బంగారం తవ్వకాలకు కేంద్రం సైతం అనుమతి ఇవ్వటానికి సిద్ధం అయ్యింది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం 45 వేల రూపాయల వరకు ఉంది. ఈ 20 ఏళ్లలో ఖర్చు మూడింతలు పెరిగింది అనుకున్నా.. 30 వేలు అవుతుంది.. బంగారం ధర 45 వేలు.. ఎంత లేదన్నా.. 10 గ్రాముల బంగారంపై 15 వేలు లాభం.

అనంతపురంలోని రామగిరి ప్రాంతంలోని 130 హెక్టర్లలో.. చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట, మల్లప్పకొండ, బిసానట్టం గ్రామాల్లోని బంగారం గనుల నుంచి అతి త్వరలోనే బంగారం బయటకు వచ్చిన ఆశ్చర్యం లేదు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు