అయితే ఇప్పుడు నిమ్మగడ్డపై హత్య కేసు పెడతారా : మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలతో ఏపీలో ఇదే ఇప్పుడు చర్చ :

Nimmagadda ramesh kumar last signature

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు పెరగటానికి కారణం ఎవరు? రోజువారీ కేసులు జీరోకు వచ్చిన సమయంలో.. వ్యాక్సిన్ ప్రక్రియ ముమ్మరం చేయాలని భావించింది సీఎం జగన్ ప్రభుత్వం. ఇదే సమయంలో.. 2018లో నిర్వహించాల్సిన ఎన్నికలను నిర్వహించకుండా.. తన విచక్షణాధికారంతో కోర్టులకు వెళ్లి.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతున్నాయంటూ ప్రశ్నలపై ప్రశ్నలు సంధించి.. స్థానిక ఎన్నికలను నిర్వహించారు అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.

స్థానిక ఎన్నికలు అయినపోయిన వెంటనే కరోనా కేసులు విపరీతంగా పెరగటం మొదలైందని ఏపీలో.. ప్రజలు  చర్చించుకుంటున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని.. వ్యాక్సినేషన్ తర్వాత ఎన్నికలకు వెళ్దాం అని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చేతులు జోడించి చెప్పినా.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ససేమిరా అన్నారు. ఆయనకు మద్దతుగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి.

స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ మొదలైన కరోనా.. ఏప్రిల్ 25వ తేదీతో 12 వేల కేసులకు వెళ్లింది. స్కూల్స్ బంద్, సినిమా హాళ్లు బంద్, మళ్లీ అన్నీ బంద్ వరకు వచ్చాయి. కరోనా విలయలాండవం చేస్తోంది. దీని అంతటికీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియంతృత్వ వైఖరిపై.. ప్రజల ఆరోగ్యంపై ఆయన ఉన్న శ్రద్ధ ఏంటో స్పష్టం అవుతుంది అంటున్నారు ప్రజలు.

ఇప్పుడు ఇలాంటి మాటలు ప్రజల నుంచి రావటానికి.. ప్రజల్లో చర్చ జరగటానికి మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలే కారణం.

తమిళనాడులో రోజువారీ కరోనా కేసులు 15 వేలు దాటాయి. రాత్రి కర్ఫ్యూ పెట్టారు. అయినా ఆగటం లేదు కేసులు. తమిళనాడులో కరోనా కేసులు, మరణాలపై స్పందించిన మద్రాస్ హైకోర్టు.. ఎన్నికల సంఘాన్ని కడిగిపారేసింది.. ఎన్నికల సంఘం వారు వేరే గ్రహంలో ఉన్నారా.. భూమిపై బతకటం లేదా,  కరోనా కేసులు పెరుగుతుంటే.. ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటే ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు.. ర్యాలీలు, సభలు, సమావేశాలకు ఎలా అనుమతి ఇచ్చారు అని ఎన్నికల సంఘం అధికారులను ఉద్దేశించి.. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అధికారులపై హత్య కేసులు పెట్టిన తప్పులేదు అని సీరియస్ గా అన్నారు.

మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలతో విన్న, చదివిన వారు.. ఇప్పుడు ఏపీలో పరిస్థితిపై చర్చించుకుంటున్నారు. అప్పటి మా నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. 2018లో జరగాల్సిన ఎన్నిలను.. కరోనా టైంలో పెట్టి మమ్మల్ని ఈ దుస్థితికి తీసుకొచ్చాడు అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ఏపీలో అంటే అయిపోయాయి.. ఐదు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది విడతల్లో పోలింగ్ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే దండం పెట్టాలి.ప్రజల ఆరోగ్యం కంటే ఎన్నికలే ముఖ్యం అని ఏకంగా ప్రధాని మోడీనే 16 ర్యాలీల్లో పాల్గొన్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు