ఆరుగురి హత్య వెనక అసలు నిజం ఇదీ.. వాడి సుఖమే ఆరుగురిని బలి తీసుకుంది.. ఆడదాని మోజులో.. కుటుంబం నాశనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని.. వారి ఇంట్లోనే అత్యంత కిరాతంగా హత్య చేశాడు అప్పలరాజు. ఏప్రిల్ 15వ తేదీ గురువారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దేశం మొత్తం షాక్ అయ్యింది. మృతులు రమణ (63), ఉషారాణి(35), రమాదేవి (53), అరుణ(37), ఉదయ్‌ (2), ఇషిత (ఆరు నెలలు)గా గుర్తించారు. వీళ్లందరూ విజయ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు. చనిపోయిన వారిలో విజయ్ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, పిన్ని ఉన్నారు.

హత్యకు కారణం ఏంటీ ?

అప్పలరాజు అనే వ్యక్తి.. విజయ్ కుటుంబం మొతాన్ని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. దీనికి కారణం వివాహేతర సంబంధం. హంతకుడు అప్పలరాజు కుమార్తెతో.. విజయ్ కు వివాహేతర సంబంధం ఉందని.. గతంలో ఈ విషయంపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యి ఉన్నాయని.. రెండేళ్లుగా రెండు కుటుంబాల మధ్య ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయని చెబుతున్నారు పోలీసులు.

గతంలోనే పోలీస్ కంప్లయింట్స్ 

హంతకుడు అప్పలరాజు.. గతంలో విజయ్ వ్యవహారశైలిపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు. నా కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.. ఈ విషయంపై అప్పట్లోనే విజయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. బెయిల్ పై విడుదల అయ్యాడు. 2018 నుంచి విజయ్ – అప్పలరాజు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నా కుమార్తెను వదిలేయ్ అంటూ చాలాసార్లు అప్పలరాజు.. విజయ్ ను బెదిరించినట్లు చెబుతున్నారు పోలీసులు.

మూడేళ్లుగా కక్ష పెంచుకున్న అప్పలరాజు 

తన కుమార్తెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విజయ్ పై 2018 నుంచి కక్ష పెంచుకున్నాడు అప్పలరాజు. పోలీస్ కేసులు పెట్టినా.. అరెస్ట్ చేసినా ఫలితం లేకపోవటం కక్ష కట్టాడు. అదును కోసం ఎదురుచూస్తున్నాడు అప్పలరాజు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 15వ తేదీ అందరూ ఇంట్లోనే ఉన్నారన్న విషయం తెలుసుకుని.. గొడల్లి, కత్తితో ఇంట్లోకి వచ్చి అందరి పీకలు కోసి కిరాతకంగా చంపేశాడు.

ఇంట్లో చక్కని భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. పరాయి ఆడదాని మోజులో పడి.. తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు విజయ్ అంటున్నారు జనం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు