హిజ్రాగా మారిన మహబూబ్ నగర్ వాసి.. కడప జిల్లాలో ఆత్మహత్య

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నక్కలబండ తండాకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఏడాది క్రితం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా దొరకలేదు. అయితే ఫిబ్రవరి 4న మేనమామ కొడుకు వినోద్ కి వీడియో కాల్ చేసి.. తాను ప్రస్తుతం కడప ఏఎస్ఆర్ కాలనిలో ఉంటున్నాని. తనను కొందరు ఇక్కడికి తీసుకొచ్చి హిజ్రాగా మార్చారని చెప్పాడు. తమతోపాటు మరో ముగ్గురు యువకులను ఇలాగే మార్చారని తెలిపాడు. తన పేరును శ్రీలేఖగా మార్చారని వివరించాడు. అయితే ఫోన్ మాట్లాడే క్రమంలోనే శ్రీకాంత్ అలియాస్ శ్రీలేఖ పురుగుల మందు సేవించింది. తానో యువకుడిని ప్రేమిస్తే అతడు మోసం చేసి వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలిపి.. కిందపడి పోయింది.

దింతో వినోద్ జడ్చర్ల పోలీసుల సాయంతో కడప పోలీసులను సంప్రదించారు. వెంటనే స్పందించిన కడప పోలీసులు శ్రీలేఖను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. శ్రీలేఖ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందారు. కాగా శ్రీకాంత్ అలియాస్ శ్రీలేఖ తల్లిదండ్రులు చిన్నతమలోనే మృతి చెందారు. దింతో తన సోదరుడితో కలిసి అమ్మమ వాళ్ళ ఇంటిదగ్గరే ఉండేవాడు. ఈ తరుణంలోనే కనిపించకుండా పోయిన శ్రీకాంత్ ను గుర్తు తెలియని వ్యక్తులు హిజ్రాగా మార్చారు. ఇక శ్రీకాంత్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీకాంత్ ను ఇలా చేసిన వారిని గుర్తించాలని పోలీసులను వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు

హిజ్రాగా మారిన మహబూబ్ నగర్ వాసి.. కడప జిల్లాలో ఆత్మహత్య

 

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు