ఎన్నికల వేళ యువతకు బిస్కెట్లు వేస్తున్న సీఎం మమతా

ఎన్నికల వేళ యువతకు బిస్కెట్లు వేస్తున్న సీఎం మమతా

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. 2021 ఏప్రిల్, మే నెలల్లో ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దింతో ప్రధాన పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సారి పోటీ హోరాహోరీగా ఉంటుంది. తృణమూల్ వర్సెస్ బీజేపీల మద్యే పోటీ ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే తిరిగి అధికారం చేపట్టాలని మమతా బెనర్జీ బావిస్తోంది.

దీనికి తగినట్లుగానే అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతుంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే కొత్త పథకాలు ప్రారంభించింది దీదీ.. బీజేపీని ఎదురుకోవాలి అంటే ఖశ్చితంగా యువతను తమవైపుకు తిప్పుకోవాలి లేదంటే కష్టం. దింతో యువతను ఆకర్షించేలా పథకాలు తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోటార్‌ బైక్‌లతో యూత్‌కు బిస్కెట్ వేస్తున్నారు. ఏకంగా రెండు లక్షల మోటార్ సైకిళ్లను యూత్‌కు పంపిణీ చేయాలని మమత డిసైడ్ అయ్యారు.

యువతను వ్యవసాయ రంగంవైపు మళ్లించి, వారిని ప్రోత్సహించే విధంగా వారికీ మోటార్ సైకిళ్ళు ఇవ్వనుంది. ‘కర్మ్ సాథీ స్కీం’ పేరుతొ మోటర్ సైకిళ్ళు అందించేందుకు సిద్ధమైంది. మొత్తం 2 లక్షల మందికి ఈ మోటర్ సైకిళ్ళు పంపిణి చేయనుంది ప్రభుత్వం. మరో 8 లక్షమంది యువతకు ప్రభుత్వం నుంచి లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ మోటర్ సైకిళ్లపై యువ రైతులు తాము పండించిన పంటను అమ్ముకునేందుకు, కూరగాయలు వంటి వాటిని అమ్మెందుకు మంచిగా ఉపయోగపడతాయని దీదీ చెబుతుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు