మద్యం దొరక్క షేవింగ్ లోషన్ తాగాడు..

మద్యం దొరక్క షేవింగ్ లోషన్ తాగాడు..

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి షేవింగ్ లోషన్ తాగాడు.. విజయవాడలోని సాయిరామ్ థియేటర్ సమీపంలోని సెలూన్ లో లక్ష్మణ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. మద్యానికి అలవాటైన లక్ష్మణ్ రోజు తాగుతుండేవాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ నెల 5వ తేదీన షాప్ కి వెళ్ళాడు.

తాగేందుకు డబ్బు లేక షాప్ లోని షేవింగ్ లోషన్ తాగాడు. తాగిన వెంటనే బాగానే ఉన్న లక్ష్మణ్… సాయంత్రానికి అస్వస్థతకు గురయ్యాడు. గుండెల్లో నొప్పు, వాంతులు, కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అతడ్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మణ్ మృతి చెందారు. భార్య నాగమణి ఫిర్యాదుతో చిట్టినగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా లాక్ డౌన్ సమయంలో మద్యం దొరక్క చాలా మంది శానిటైజర్ తాగి మృతి చెందారు. చిత్తూరు అప్పట్లో చిత్తూరు జిల్లాలో ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు శానిటైజర్ సేవించి మృతి చెందారు.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు