నువ్వు కేక తతా : పిచ్చుక గూడు మాస్క్ తో అధికారులకు షాక్ ఇచ్చిన తాతయ్య

పిచుక గూడే అతని మాస్క్.. ప్రభుత్వ ఆఫీసుకు వచ్చిన తెలంగాణ వ్యక్తి.. షాక్ అయిన ఆఫీసర్స్.. కొత్త ఆవిష్కరణ చేసిన కొమరయ్య

తెలంగాణ రాష్ట్రంలో వృద్ధుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది.. కరోనా సమయంలో వాళ్లు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు అనటానికి ఈ ఫొటో సజీవ సాక్ష్యం. మహబూబ్ నగర్ జిల్లా చిన్నమునగల్ గ్రామానికి చెందిన మేకల కుమరయ్య ఏప్రిల్ 22వ తేదీ ఉదయం మండల కార్యాలయానికి వచ్చాడు. పెన్షన్ తీసుకోవటానికి ఆఫీసులోకి వెళుతుంటే.. మాస్క్ లేదని సిబ్బంది ఆపారు.

అయితే మేకల కుమరయ్యకు మాస్క్ ఉంది.. అది చాలా విచిత్రంగా ఉంది. పిచ్చుక గూడును మాస్క్ గా పెట్టుకుని వచ్చాడు. ఇదేమి విచిత్రం.. మాస్క్ పెట్టుకోవచ్చు కదయ్యా అని అడిగితే.. మాస్క్ కొనుక్కోవటానికి డబ్బులు లేవు.. మీరు ఇచ్చే పెన్షన్ తో ఎలాగోలా బతుకుతున్నాను.. తినటానికే డబ్బులు లేవు.. ఇక మాస్క్ ఎక్కడ కొనుక్కుంటాను అని చెప్పాడు.

కరోనా వైరస్ రక్షణ కోసం డబుల్ లేయర్ మాస్క్ పెట్టుకోవాలని డాక్టర్లు, శాస్త్రవేత్తలు పదేపదే చెబుతున్నారు. కరోనా విపరీతంగా ఉన్న ఈ సమయంలో.. వాటి ధరలు సైతం ఆకాశాన్ని అంటాయి. మామూలు సర్జికల్ మాస్స్ 10 రూపాయలు పలుకుతుంది. ఇక డబుల్ లేయర్ మాస్క్ 25 రూపాయలు, ఎన్95 మాస్క్ 200 రూపాయల వరకు ఉంది. వచ్చే వెయ్యి రూపాయల పెన్షన్ తో బతకటమే కష్టం అనుకుంటే.. ఇక మాస్క్ ఎక్కడ కొనుక్కుంటాను అంటున్నాడు కొరమయ్య.

మాస్క్ లేకపోతే అధికారులు ఆఫీసులోకి రానివ్వటం లేదు.. అందుకే అందుబాటులో ఉన్న పిచ్చుక గూడు పెట్టుకుని వచ్చాను అని చెబుతున్నాడు కొమరయ్య.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు