కరోనా అని తెలియగానే.. పురుగుల మందు తాగి చచ్చిపోయాడు..

man self demise with fear of covid 19 virus

ఇదేం విడ్డూరమే.. ఇదేమో విచిత్రమో.. ఇవాల్టి కుర్రోళ్లు మరీ చిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయి.. కరోనా వస్తే ఎలా అని ముందుగానే టెన్షన్ పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా భయాందోళనలకు గరవుతున్నారు. కరోనాను జయించగల శక్తి శరీరంలో ఉన్నా.. అందుకు మానసికంగా సిద్ధంగా లేకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన విలాయత్ అనే 26 ఏళ్ల కుర్రోడు.. గుంటూరు పని చేసుకుంటూ ఉన్నాడు. ఇటీవలే ఇంటికి వచ్చాడు. జలుబు, దగ్గుగా ఉండటంతో.. కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఏప్రిల్ 16వ తేదీ ఉదయం.. విలాయత్ కు ఫోన్ చేసిన ఆరోగ్య సిబ్బంది.. నీకు కరోనా పాజిటివ్ అని వచ్చింది.. చికిత్స తీసుకోండి అని చెప్పారు. హోం ఐసోలేషన్ లో ఉండాలి.. అవసరం అయితే క్వారంటైన్ కు తరలిస్తామని హెల్త్ సిబ్బంది స్పష్టం చేశారు.

దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు విలాయత్. కరోనా పాజిటివ్ వచ్చిందన్న బాధతో పురుగుల మందు తాగాడు. మందు తాగిన తర్వాత ఇంట్లో వారు ఫోన్ చేశారు. నాకు కరోనా వచ్చింది.. ఇంటికి రాను.. పురుగుల మందు తాగాను అని చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు విలాయత్ ఉన్న ప్రదేశానికి వెళ్లగా.. అపస్మాకర స్థితిలో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు వైద్యులు.

కరోనా వస్తే చావాల్సిన అవసరం లేదని.. విలాయత్ కు వచ్చింది చాలా తక్కువగానే ఉందని.. ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవచ్చని.. ఇదే చెప్పామని హెల్త్ సిబ్బంది అంటున్నారు. ఇంత చిన్న దానికి ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది.

కరోనాకు చికిత్స ఉంది.. అందుకు తగ్గట్టుగా ముందు మనం మనోధైర్యంతో ఉండాలి.. ఆశ ఉంటే క్యాన్సర్ జయించవచ్చు.. అదే దైర్యం లేకపోతే అల్సర్ ఉన్నా చచ్చిపోతాం.. ఇప్పుడు విలాయత్ విషయంలో ఇదే జరిగింది.. కరోనా అని తెలియగానే ముందూ వెనక ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకున్నాడు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు