120 మంది మహిళలకు నగ్న చిత్రాలు పంపిన వ్యక్తి.. బొక్కలో వేసిన పోలీసులు

120 మంది మహిళలకు నగ్న చిత్రాలు పంపిన వ్యక్తి.. బొక్కలో వేసిన పోలీసులు

చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే ప్రపంచాన్ని మొత్తం చూడొచ్చు.. మొబైల్ ను మంచికి వాడుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది. కానీ కొందరు మొబైల్ ఫోన్స్ ను చెడుకు కూడా ఉపయోగిస్తారు. వ్యసనాలకు అలవాటై నీలిచిత్రాలు చూస్తుంటారు. వారు చూసేది కాకా మరికొందరికి చూపిస్తుంటారు.. ఈ అత్యుత్సహమే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని ఉహించి ఉండరు. కాగా తన మానాన తాను చూడక మరో రెండు వందల మందికి పోర్న్ వీడియోస్ (నిలిచిత్రాలు) షేర్ చేశారు.

కర్ణాటక రాష్ట్రము చిత్రదుర్గ ప్రాంతంలోని చల్లకెరేకు చెందిన రామక్రిష్ణ అనే వ్యక్తి గత కొద్ది నెలలుగా ఇతరుల ఫోన్లకు నగ్న చిత్రాలను పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నాడు. రామకృష్ణా ఒకరిద్దరికి కాదు ఏకంగా 200 మందికి నీలిచిత్రాలు పంపాడు. ఇక వీరిలో 120 మంది మహిళలు ఉన్నారు. చల్లకెరేకు చెందిన చాలా మంది దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దింతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

అయితే రామక్రిష్ణ తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌లో పెట్టడంతో అతడ్ని కనుక్కోవటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. శుక్రవారం అతడు ఫోన్‌ ఆన్‌ చేయటంతో ట్రేసింగ్‌ ద్వారా ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నాడు.

ఫోన్‌ రింగ్‌ అయిన నెంబర్లకు మాత్రమే ఫొటోలు పంపుతానని చెప్పాడు. చాలా మంది మహిళలను వారి నగ్న చిత్రాలు పంపమంటూ వేధించానని తెలిపాడు. కాగా రామకృష్ణపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు