చాలామంది హిందువులకు దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలియదు.

చాలామంది హిందువులకు దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలియదు.

భారత్ అంటే పండుగలకు పుట్టినిల్లు. ప్రతి రోజు ఓ పండుగే.. హిందువులకు 365 రోజుల్లో. 200 లకు పైగా పర్వదినాలు ఉంటాయి. అయితే ఇన్ని పర్వదినాలు ఉన్నా హిందువులకు ఏ పండుగ ఎందుకు జరుపు కుంటారు అనేది చాలామందికి తెలియదు. ఎదో సెలవు వచ్చిందిగా పండుగ చేసుకుందా అనుకుంటారు.

70 శాతం మంది హిందువులకు దీపావళి ఎందుకు జరుపుకుంటున్నారో తెలియదు అనడంలో అతిశ్రేయోక్తి లేదు.. ఎందుకంటే మన పండుగల గురించి మనం చదువుకునే పుస్తకాల్లో లేకపోవడం. మన చరిత్ర సంస్కృతిని మన పుస్తకాల్లో చేర్చకపోవడం.. ఒకవేళ చేర్చినా కొద్దో గొప్పో అవి వక్రీకరణగా ఉండటం. ఇక తాజాగా ఓ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి గురించి పుస్తకాల్లో చేర్చింది.. కానీ దాంట్లో కొంత పైత్యం చేర్చింది. దీపావళి ఖర్చుతో కూడుకున్న పండుగ అంటూ, టపాసులు, పిండివంటలు చేసుకొని డబ్బు ఖర్చు చేసుకునే బదులు పేదలకు దానం చేస్తే వారు సుకంగా ఉంటారని ఆ పాఠం సారాంశం. అయితే ఈ పైత్యపు రాతలను కొందరు వ్యతిరేకించారు.

ఇక దీపావళి గురించి చెప్పాల్సి వస్తే.. ప్రధానంగా రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి రాముడు రావణాసురుడిని హతమార్చి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజని కొందరు చెబుతారు. ఇక సత్యభామ నరకాసురుడిని సంహరించిన తెల్లారి పీడ విరగడైంది అనే ఉద్దేశంతో దీపావళి జరుపుకుంటారని చెబుతున్నారు. ఏది ఏమైనా రాక్షస సంహారం జరిగిన తర్వాత ఈ దీపావళి జరుపుకుంటారు అనేది వాస్తవం.

రాక్షసుల చేత పీడింప బడుతున్న దేవాది దేవతలకు విముక్తి కలిగించేందుకు రాక్షస సంహారం చేసి శాంతిని నెలకొల్పడం. పరిస్థితిల్లో మార్పు తీసుకురావడం. శాంతిని పెంపొందించడం ఈ పండుగ ఉద్దేశం. అయితే ఇక్కడ, నరకాసురుడు, రావణాసురుడు మొదట్లో మంచివారే.. కొన్ని చెడు స్నేహాల వలన వారి బుద్ది వక్రబుద్ధి అయింది. దింతో వారిని సంహరించక తప్పలేదు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు