డబ్బులు ఉన్నాయని ఆస్పత్రిలో జాయిన్ అవుతున్నారు.. 30 శాతం కరోనా పేషెంట్ల పరిస్థితి ఇదే..

డబ్బులు ఉన్నాయని ఆస్పత్రిలో జాయిన్ అవుతున్నారు.. 30 శాతం కరోనా పేషెంట్ల పరిస్థితి ఇదే..

Many patients found occupying hospital beds without needing
Many patients found occupying hospital beds without needing

డబ్బులు ఉన్నాయని ఆస్పత్రిలో జాయిన్ అవుతున్నారు.. 30 శాతం కరోనా పేషెంట్ల పరిస్థితి ఇదే..

దేశంలో కరోనా విలయతాండం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ శుక్రవారం ఒక్క రోజే 3 లక్షల 48 వేల మంది కరోనా బారిన పడితే.. దాదాపు 3 వేల మంది చనిపోయారు. ఇది అధికారిక లెక్క.. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోని బెడ్స్ పరిస్థితి ఏంటీ.. వాటి లెక్కలు ఏంటీ.. అందులో ట్రీట్ మెంట్ పొందుతున్న వారి ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయాలను యుద్ధ ప్రాతిపదికన తెప్పించుకుంది కేంద్ర ప్రభుత్వం.

ఇక్కడే ఓ కఠోరమైన వాస్తవం బయటపడింది. వేట్ ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ పొందుతున్న వారిలో 30 శాతం మందికి అసలు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరమే లేదంట.. వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నాయి.. మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని ప్రైవేట్ ఆస్పత్రులు బెడ్స్ ఇచ్చేస్తున్నారంట. దీని వల్ల బెడ్స్ కొరత వచ్చి.. మరింత దోపిడీకి కారణం అవుతుంది అని తేల్చారు.

ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాకు ట్రీట్ మెంట్ పొందుతున్న ప్రతి 100 మందిలో 30 మంది ఇంటి దగ్గరే ఉండి చికిత్స తీసుకుంటే నయం అవుతుందని రిపోర్టులు చెబుతున్నాయి. అయినా ప్రైవేట్ ఆస్పత్రుల డబ్బు దాహానికి.. కరోనాపై ఉన్న భయంతో డబ్బులు ఉన్నాయి కదా అని.. ఆస్పత్రిలో జాయిన్ అవుతున్నారంట. దీని వల్ల బెడ్స్ కొరత తీవ్రంగా వచ్చినట్లు చెబుతున్నారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవుతుంది. ఇంట్లోనే ఉండి చికిత్సకు కరోనా తగ్గిపోయే అవకాశం ఉంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్పత్రిలో బెడ్ ఇవ్వొద్దని.. వాళ్లకు భరోసా ఇచ్చి.. మందులు ఇచ్చి పంపించాలని స్పష్టం చేసింది. వాళ్లు డబ్బులు కడుతున్నారు కదా అని దోచుకోవటానికి చూస్తే.. నిజమైన కరోనా పేషెంట్లకు అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు