మాస్క్ లేకపోతే రూ.1,000 ఫైన్ – ప్రభుత్వం ఉత్తర్వులు జారీ – ఇప్పుడైనా వస్తుందా భయం, బాధ్యత

మాస్క్ లేకపోతే రూ.1,000 ఫైన్ - ప్రభుత్వం ఉత్తర్వులు జారీ - ఇప్పుడైనా వస్తుందా భయం, బాధ్యత

mask must
mask must

మాస్క్ లేకపోతే రూ.1,000 ఫైన్ – ప్రభుత్వం ఉత్తర్వులు జారీ – ఇప్పుడైనా వస్తుందా భయం, బాధ్యత

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలు బాధ్యత, భయం లేకుండా తిరుగుతున్నారని.. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇస్తూ.. కఠిన ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో మాస్క్ పెట్టుకోకుండా కనిపిస్తే.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. ఎవరైనా సరే.. మాస్క్ తప్పనిసరి చేస్తూ.. ఈ అధికారాన్ని కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.

పోలీస్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లకు జరిమానా విధించే అధికారం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సీఎం కేసీఆర్ ప్రభుత్వం. ఇక నుంచి ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఏ ప్రదేశంలో అయినా మాస్క్ లేకుండా కనిపించే వ్యక్తికి వెయ్యి రూపాయల ఫైన్ విధించనున్నారు అధికారులు. ఫైన్ విధించే అధికారాన్ని పోలీసులు, మున్సిపల్ అధికారులు, ఇతర సిబ్బందికి అప్పగించనుంది ప్రభుత్వం.

బహిరంగ ప్రదేశాల్లో.. ప్రయాణాల్లో.. కూరగాయల మార్కెట్ దగ్గర, షాపులు, దుకాణాలు.. బార్లు, పబ్స్, వైన్ షాపులు, సినిమా హాల్స్, మాల్స్, సింగిల్ ధియేటర్లు, నెట్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు.. ఆఫీసులు, ఐటీ కారిడార్ ఇలా ఒక చోటు అని కాదు.. ఎక్కడైనా సరే మాస్క్ లేకుండా కనిపిస్తే వెయ్యి రూపాయల ఫైన్ విధించటమే కాకుండా.. బలవంతంగా వసూలు చేస్తారు. ఒంటరిగా ఉన్నా.. మాస్క్ పెట్టుకునే ఉండాలి..

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 11వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమలు కానున్నాయి. సో.. తెలంగాణ ప్రజలే కాదు.. అందులో అంతర్భాగంగా ఉన్నా హైదరాబాదీలు బీ అలర్ట్.. మీ కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి, బంధువులు, చుట్టాలు, స్నేహితులకు కూడా చెప్పండి.. తెలంగాణలో మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయల ఫైన్ వేస్తారని.. ఈ ఆంక్షలతో అయినా జనంలో భయం, బాధ్యత వస్తాయేమో చూడాలి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు