పాతబస్తీలో ఎంఐఎం – బీజేపీ కార్యకర్తల కొట్లాట

ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీని అడ్డుకున్న స్థానికులు

వరద బాధితుల ఆగ్రహం హైదరాబాద్ లో ఇంకా చల్లారలేదు. పాతబస్తీలోని గౌలిపుర ప్రాంతంలో గురువారం బస్తీ దవాఖానాకు వచ్చిన ఎంఐఎం పార్టీకి చెందిన యాకుత్ పురా నియోజకవర్గం ఎమ్మెల్యే పాషాఖాద్రీని బస్తీవాసులతోపాటు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వరదల్లో సర్వస్వం కోల్పోయాం అని.. అయినా ఎవరూ ఆదుకోలేదని.. 10 వేల రూపాయల ఆర్థిక సాయం కూడా ఇవ్వలేదు అంటూ వాగ్వాదానికి దిగారు.

ఎమ్మెల్యేకు మద్దతుదారులు ఆందోళనకారులను అడ్డుకోవటంతో తొపులాట జరిగింది. రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఉద్రిక్తత నెలకొనటంతో ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు పోలీసులు. బస్తీ దవాఖానా ప్రారంభోత్సవం రసాభాసగా మారటంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు నిర్వహకులపై.

> గౌలిపుర ప్రాంతంలో బస్తీ దవాఖానా ప్రారంభోత్సవం రసాభాస
> ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీని అడ్డుకున్న స్థానికులు
> వరద సాయం అందలేదని నిలదీతతో ఉద్రిక్తం
> ఎంఐఎం – బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు