ఏపీలో మినీ లాక్ డౌన : కఠిన ఆంక్షలు విధించిన ప్రభుత్వం

cm jagan tirupati tour cancel

ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మే 2వ తేదీ ఒక్క రోజే 20 వేల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తి కట్టడికి నడుం బిగించిన ప్రభుత్వం. ఉన్నతాధికారులతో సమావేశం అయిన సీఎం జగన్.. మీటింగ్ తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో మినీ లాక్ డౌన్ విధించాలని నిర్ణయించారు. మే 5వ తేదీ అంటే బుధవారం నుంచి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపారులు జరిగే విధంగా ఆంక్షలు విధించారు. 12 గంటల తర్వాత రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ ఉంటుంది. అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. షాపులు, బస్సులు, నిత్యావసరాలు వంటివి అన్నీ మూసివేయబడతాయి. లాక్ డౌన్ అంటే రెండు గంటలు మాత్రమే బయటకు వచ్చేందుకు అవకాశం ఉండేది.. ఇప్పుడు ఆరు గంటలు సమయం ఇస్తున్నారు.

ప్రజలు తమ అవసరాలను ఉదయం 6 నుంచి 12 గంటల్లోపు పూర్తి చేసుకోవాలని.. ఆ తర్వాత అందరూ ఇళ్లల్లోనే ఉండాలని.. బయటకు వస్తే కేసులు పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. మెడికల్ షాపులు, ఆస్పత్రులు, మీడియా, పెట్రోల్ బంకులు, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు, రైళ్లు, విమాన సర్వీసులు, సరుకు రవాణా వంటి వాటిపై ఎలాంటి ఆంక్షలు లేవని.. ప్రయాణికులు ఎవరైనా సరే టికెట్ చూపించి నిర్భయంగా వెళ్లొచ్చని చెబుతున్నారు అధికారులు.

15 రోజులు మినీ లాక్ డౌన్ అమల్లో ఉంటుందని.. అప్పటికీ కేసులు కంట్రోల్ లోకి రాకపోతే పూర్తిగా లాక్ డౌన్ విధించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు అధికారులు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు