వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కేసుల సంఖ్య గత వారం రోజులుగా మళ్ళీ పెరుగుతుంది. గత నెలలో తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు, ఇప్పుడు క్రమంగా పెరుగుతూన్నాయి. దేశంలో మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్ర అధికంగా ఉంది. ఇక తాజాగా కరోనా టీకా తీసుకున్న గుజరాత్ క్రీడాశాఖామంత్రి ఈశ్వర్ సింగ్ పటేల్ కరోనా భారినపడ్డారు. ఈ విషయాన్నీ ఈశ్వర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా నిర్దారణ కావడంతో ఆయన వెంటనే గాంధీనగర్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేరారు.

అయితే ఈశ్వర్ సింగ్ మార్చి 13న కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినా కూడా అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 3,29,47,432 మందికి కరోనా టీకాలు వేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, తమిళనాడులలో కోవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కరోనా అదుపులోకి వచ్చిందని చెప్పవచ్చు. కేసుల సంఖ్య క్రమంగా తగ్గతుంది. కరోనా మృతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 9 లక్షల మంది ఈ మహమ్మారి భారిన పడగా, 7,184 మంది మృతి చెందారు. తెలంగాణ విషయానికి వస్తే 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి… 1,654 మంది మృతి చెందారు. ఇక రెండు రాష్ట్రాల్లో వెయ్యికి లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి.

వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా పాజిటివ్

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు