పాతబస్తీలోనూ టీఆర్ఎస్ గెలుస్తుంది – సవాల్ చేసిన కేటీఆర్

జీహెచ్ఎంసీ పీఠం టీఆర్ఎస్ పార్టీదే అని.. ఇప్పుడే కాదు.. వచ్చే 10 సంవత్సరాలు జీహెచ్ఎంసీలో గెలుపు

గ్రేటర్‌ వార్‌లో తామెవరితోనూ పొత్తు పెట్టుకోబోమని.. మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. బల్దియా ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేస్తూనే.. గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 స్థానాల్లో గెలుపొందామని.. మరో స్థానంలో కేవలం 5 ఓట్ల తేడాతో కోల్పోయామని.. ఉదహరించారు. ఈ సారి పాతబస్తీలో 10 సీట్లు గెలుపొందుతామని సవాల్ చేశారు. అన్ని పార్టీల్లాగే ఎంఐఎం ఒకటని.. అందులో సందేహం లేదని స్పష్టం చేస్తూ.. ఎంఐఎంపై గెలిచి టీఆర్ఎస్ సత్తా చూపిస్తామన్నారు.

మజ్లీస్‌తో లోపాయకారి ఒప్పందం ఉందనే వాదనల్లో వాస్తవం లేదని.. కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎంఐఎం అభ్యర్థులు నిలబడే స్థానాల్లో నామమాత్రంగా టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తారనే ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. బల్దియా పీఠం తమదే అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 4 వ తేదీన గ్రేటర్‌ పీఠంపై టీఆర్ఎస్‌కు చెందిన మహిళా అభ్యర్థే కూర్చుంటారని.. జోస్యం చెప్పారు.

ఎంఐఎంతో దోస్తీ అనేది ఎన్నికలు – ఎన్నికల తర్వాత ఉండదని.. జీహెచ్ఎంసీ పీఠం టీఆర్ఎస్ పార్టీదే అని.. ఇప్పుడే కాదు.. వచ్చే 10 సంవత్సరాలు జీహెచ్ఎంసీలో గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అన్నారు మంత్రి కేటీఆర్.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు